జొమేటో‌పై జాక్ మా ఎఫెక్ట్..? స్కాన్ చేస్తోన్న సెబీ

2021-05-04 17:30:52 By Anveshi

img

జొమేటో ఈ మధ్యనే రూ. 8250కోట్ల ఐపిఓ కోసం డ్రాఫ్ట్‌రెడ్‌హెర్రింగ్ ప్రాస్పెక్టస్ దాఖలు చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఐతే జొమేటో ఐపిఓకి ఆదిలోనే పెద్ద చిక్కు ఎదురయ్యేలా ఉంది.చైనాకి సంబంధించిన పెట్టుబడులు ఇందులో ఉండటమే ఇందుకు కారణం. అలీబాబా,యాంట్ గ్రూప్ సంస్థల వ్యవస్థాపకుడైన జాక్‌మా జొమేటోలో భాగస్వామ్యం ఉన్న సంగతి తెలిసిందే. జొమేటోలో కంట్రోలింగ్ స్టేక్ యాంట్ గ్రూప్‌దే. 

 

స్టార్టప్స్ అయినా, ఇంకో సంస్థ అయినా సరే, కంట్రోలింగ్ స్టేక్ చైనాదేశానికి చెందిన కంపెనీలకు, లేదంటే ఆ పైన అయినా టేకోవర్ చేసే  అవకాశాలు ఉన్నప్పుడు ముందుగా విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అనుమతి తీసుకోవాలి. ఇది ఇక్కడ కూడా వర్తిస్తుందా లేదా అనేది పరిశీలిస్తున్నట్లు సెబీ వర్గాలు చెప్తున్నాయ్. 

 

జొమేటోలో ఇన్ఫోఎడ్జ్, ఇంటర్నెట్ ఫండ్(టైగర్ గ్లోబల్)యాంట్ ఫైనాన్షియల్ సంస్థలు ప్రధాన వాటాదారులు. ఇన్ఫోఎడ్జ్‌కి 18.55, అలీపే,యాంట్ ఫైనాన్షియల్స్‌కి 16.53శాతం వాటా ఉన్నాయ్.2018 నుంచే యాంట్ ఫైనాన్షియల్‌కి జొమేటోలో వాటాలు ఉన్నాయ్. రెండో పెద్ద పెట్టుబడి కూడా యాంట్ ఫైనాన్షియల్‌దే. జొమేటోలో 3243కోట్ల రూపాయల పెట్టుబడి ఉంది.

జొమేటోలో యాంట్ ఫైనాన్షియల్‌కి ఉన్న హక్కులు

1. మెజారిటీ డైరక్టర్లను  నియమించే అధికారం 
2.మేనేజ్‌మెంట్ కంట్రోల్

3.పాలసీ డెసిషన్లను తీసుకునే అదికారం  ఉన్నాయ్.

ఈ 3 అధికారాలు కూడా షేర్‌హోల్డర్ల వోటింగ్ అగ్రిమెంట్‌కి లోబడే ఉంటాయ్. ఐతే చైనా దేశపు సైన్యం, ఈస్ట్ లద్దాక్ గల్వాన్ లోయ దగ్గర మన సైనికులపై దాడి చేయడం, ఆ తర్వాతి పరిణామాల నేపథ్యంలో సరిహద్దు దేశాలకు చెందిన సంస్థలు మన దేశపు కంపెనీల్లో కంట్రోలింగ్ స్టేక్ కానీ, వాటాలు కానీ  కొనుగోలు చేయాలంటే ముందుగా కేంద్రమంత్రిత్వశాఖల అనుమతి తీసుకోవాలని రూల్ పాస్ అయింది. ఇప్పుడు మరి జొమేటో ఆ రూలింగ్ కిందకు వస్తుందా లేదా అన్నదే తేలాల్సి ఉంది
 


zomato ipo dhrp scan sebi fdi ant group jackma telugu profit trade

Expert's View


ఒక స్టాక్ మల్టీ బ్యాగర్ అవ్వటానికి 20 సంవత్సరాలు పడుతుందా ?

Trending