PNB హౌసింగ్ ఫైనాన్స్‌కి సెబీ బ్రేక్! కార్లైల్ గ్రూప్‌తో రూ.4వేలకోట్ల ఒప్పందాన్ని నిలిపివేయాలంటూ ఆదేశాలు

2021-06-20 12:43:07 By Anveshi

img

పంజాబ్ నేషనల్ హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ జోరుకు సెబీ బ్రేకులేసింది. అమెరికన్ ప్రవేట్ ఈక్వీట్ ఫర్మ్ కార్లైల్ గ్రూప్‌తో తన వాటా విక్రయించి రూ.4వేల కోట్ల నిధులు సమీకరించే ఒప్పందం నిలిపివేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఇదే విషయంపై గత  వారం మనం ఓ కథనంలో వాటి వివరాలు చెప్పుకున్నాం, బుక్ వేల్యూ కంటే చాలా తక్కువగా పిఎన్‌బి హౌసింగ్ ఫైనాన్స్  షేర్లకు విలువ కట్టి వాటాలను విక్రయిస్తున్నారంటూ స్టేక్‌హోల్డర్స్ ఎంపవర్‌మెంట్ సర్వీసెస్ పేరున్న  ఓ సంస్థ దీనిపై సెబీకి  కంప్లైంట్ చేసింది. అలానే కార్పొరేట్ వ్యవహారాలశాఖ కూడా ఈ వ్యవహారంపై ఆరా తీసిన నేపథ్యంలో సెబీ తాజా ఆదేశాలు సంచలనం కలిగిస్తున్నాయ్. 

 

చదవండి మా కథనం  (పంజాబ్ నేషనల్ బ్యాంక్ హౌసింగ్ ఫైనాన్స్‌కి చిక్కులు తప్పవా..? కార్లైల్ డీల్‌పై సెబీ స్కానింగ్! డీల్‌ని వ్యతిరేకించాలంటూ షేర్ హోల్డర్లకు SES సంస్థ పిలుపు

 

హెచ్‌డిఎఫ్‌సి‌ బ్యాంక్‌లో ఉన్నతపదవిని అధిరోహించి మంచి వృద్ధిబాటలో పయనింపజేసిన ఆదిత్యపురి కార్లైల్ గ్రూప్‌లో ఓ  డైరక్టర్‌గా ఉన్నారు. ఆయనే ఈ డీల్‌ని సెట్  చేశారంటారు. కార్లైల్ గ్రూప్‌ నుంచి రూ.4వేలకోట్ల పెట్టుబడి పెట్టించడమే కాకుండా, సంస్థలో సీనియర్ పదవిని చేపట్టనున్నారాయన. దీంతో ఈ సంస్థ భవిష్యత్తు కూడా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌లానే పరుగులు  పెడుతుందనే అంచనాలు బయలుదేరాయ్. షేరు ధర కూడా ర్యాలీ చేయడమే కాకుండా, అనలిస్టులు, బ్రోకరేజీ సంస్థలు  పిఎన్‌బి హౌసింగ్ ఫైనాన్స్ షేర్లకు రీరేటింగ్ ఇవ్వడం ప్రారంభమైంది

 

ఐతే ఎప్పుడైతే సెబీ, కార్లైల్-పిఎన్‌బి హౌసింగ్ డీల్‌పై స్కాన్ చేయడం ప్రారంభమైందో, అప్పట్నుంచే ఈ కౌంటర్‌పై జాగ్రత్తగా వ్యవహరించాల్సిన సమయం ఏర్పడింది. దీంతో పాటే కంప్లైంట్ చేసిన స్టేక్ హోల్డర్ల్స ఎంపవర్‌మెంట్ సర్వీసెస్ సంస్థ జూన్ 22న జరిగే సర్వసభ్య సమావేశంలో డీల్‌ని వ్యతిరేకిస్తూ, ఓటేయాలని ఇన్వెస్టర్లకు పిలుపు ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే సెబీ తాజా ఆదేశాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయ్. ఈ పరిణామాల ప్రభావం రేపటి (సోమవారం) ట్రేడింగ్‌పై పడటం ఖాయంగా కన్పిస్తోంది


pnb housing finance bank carlyl group sebi ban deal aditya puri june20