స్టేట్ బ్యాంకాఫ్ ఇండియా Q4 రిజల్ట్స్‌కి మార్కెట్ ట్రేడ్ సర్కిల్స్ నుంచి మిక్స్డ్ టాక్ లభిస్తోంది. కొంతమంది అంచనాలకు తగ్గినట్లే వచ్చాయంటుంటుండగా, కొందరు మాత్రం రావాల్సిన లాభం కనీసం 900 కోట్లు తగ్గిందంటున్నారు
క్యు4లో ఎస్బీఐ రూ.9113.53 కోట్ల లాభం, రూ.31198కోట్ల నికర వడ్డీ ఆదాయం ప్రకటించింది
గత ఏడాది ఇదే నాలుగో త్రైమాసికంలో వచ్చిన రూ.27067కోట్ల వడ్డీ ఆదాయంతో పోల్చితే 15.26శాతం ఎక్కువ. కంపెనీ బ్యాడ్ లోన్లు మూడింతలు తగ్గి రూ.3262కోట్లకి చేరగా, మొత్తం ప్రొవిజన్ల విలువ రూ.7237కోట్లకి పరిమితం అయ్యాయ్
గ్రాస్ నాన్ పెర్ఫామింగ్ అసెట్స్ మొత్తం అసెట్లలో 3.97శాతంగా ఉండగా, గత త్రైమాసికంతో పోల్చితే 4.50శాతంగా నమోదు అయ్యాయ్
బోర్డ్, ఆర్థిక ఫలితాలు వెలువరించిన సందర్భంలోనే ఒక్కో షేరుకు రూ.7.10 డివిడెండ్ ప్రకటించింది
రికార్డ్ డేట్‌గా మే 26ని ఫిక్స్ చేసింది