ఆల్‌టైమ్‌ హిస్టరీ : రూ.17లక్షల కోట్ల మార్కెట్ కేపిటలైజేషన్ సాధించిన తొలి కంపెనీగా రిలయన్స్ రికార్డ్

2021-10-14 15:41:58 By Anveshi

img

బిజినెన్ టైకూన్, ప్రపంచ కుబేరుడు ముఖేష్ అంబానీ మరో చరిత్ర సృష్టించారు . ఆయన ఛైర్మన్‌గా ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ భారత కంపెనీలలో కెల్లా అత్యధిక మార్కెట్ కేపిటలైజేషన్ సాధించింది. రూ.17లక్షల కోట్ల మార్కెట్ కేపిటలైజేషన్ దక్కించుకుని తన సత్తా చాటిన రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు మార్కెట్లలో ఇవాళ 1శాతానికిపైగా పెరిగి రూ.2695.90 ధరకి చేరగానే ఆ రికార్డ్ సొంతమైంది.

 

రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు ఇవాళ ఇంట్రాడేలో తర్వాత రూ.2717.45కి కూడా చేరింది. దాంతో రిలయన్స్ మార్కెట్ కేపిటలైజేషన్  ఓ దశలో 18లక్షలకోట్లకి అతి చేరువగా వచ్చింది కూడా..!


గత నెలలోనే( సెప్టెంబర్ 27) రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ కేపిటలైజేషన్ 16లక్షల కోట్లకు చేరగా, ఖచ్చితంగా 10 సెషన్లలోనే మరో లక్ష కోట్లరూపాయలను జత చేయడం ఈ స్టాక్ దూకుడుకు నిదర్శనం. అంతేకాదు 2021 కేలండర్ ఇయర్‌లో ఇప్పటికే ఈ సంస్థ మార్కెట్ కేపిటలైజేషన్ గత ఏడాదితో పోల్చితే, 35.83శాతం పెరగడం విశేషం

 

ఇక ముగింపులో రిలయన్స్ షేర్లు స్వల్ప లాభంతో రూ.2701వద్ద ముగిశాయ్. దీంతో రూ.17లక్షల40వేల434కోట్ల వద్ద మార్కెట్ కేపిటలైజేషన్ తో రిలయన్స్ నంబర్ 1 కంపెనీగా రికార్డు సృష్టించింది


RELIANCE MARKET CAPITALISATION M-CAP RECORD 17LAKH 18TRILLOIN CRORES

Expert's View


మంచి కంపెనీల IPO లకు ఎందుకు ఆదరణ కరువైంది ?

Trending