రెగ్యులర్ ఇన్‌కమ్ కోసం ఫిక్స్‌డ్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్ ! సొమ్ము భద్రమే కానీ..వడ్డీ మరీ ఎక్కువేం కాదు మరి..!

2022-05-14 11:12:08 By Anveshi

img

నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్, ఫ్లోటింగ్ రేటింగ్ సేవింగ్ బాండ్స్ ఈ  రెండు పద్దతుల్లో పెట్టుబడి పెడితే, ఇదమిద్దంగా ఇదీ అని ఓ ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నాయ్

సురక్షితం
నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్స్ ‌లో పెట్టుబడి పూర్తిగా సురక్షితం
ఇండియా పోస్ట్, వీటిని జారీ చేస్తుంది. అలానే ఫ్లోటింగ్ రేటింగ్ సేవింగ్ బాండ్స్ ఆర్బీఐ జారీ చేస్తుంది

రాబడి
నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్ 6.8శాతం రాబడి ఇస్తుండగా, FRSB 7.15శాతం వడ్డీ రేటు ఇస్తుంది.NSCలు మెచ్యూరిటీ డేట్ తర్వాత పే చేస్తాయి..ఫ్లోటింగ్ రేటు బాండ్లు మాత్రం ప్రతి 6 నెలలకి ఓసారి వడ్డీ ఇస్తాయి.మనం పెట్టుబడి పెట్టే సమయంలో ఏ వడ్డీ అయితే చెప్తారో..( అమలవుతుందో) ఆ వడ్డీనే కాలపరిమితి తర్వాత వరకూ ఎన్ఎస్‌సిలు ఇస్తుండగా, ఎన్ఎస్‌సి ఇచ్చే వడ్డీ కంటే 35 బేసిస్ పాయింట్లు అదనంగా అర్బీఐ FRSB ద్వారా చెల్లిస్తుంది

 

ఇతర ఏ డిపాజిట్ల కంటే కూడా ఈ వడ్డీరేట్లు ఆకర్షణీయం అనడంలో సందేహమే లేదు

 

కాలపరిమితి
నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్ కాలపరిమితి ఐదేళ్లు
FRSB మాత్రం ఏడేళ్లు కాలపరిమితి ఉంటుంది
ఐతే 60-70ఏళ్ల వయసువారికి  6ఏళ్లు
70-80ఏళ్ల వయసువారికి 5  ఏళ్లు
80ఏళ్లు దాటిన వ్యక్తులకు 4ఏళ్లు మాత్రమే లాక్ ఇన్ పీరియడ్

నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్ల పెట్టుబడిపై వచ్చే వడ్డీపై పన్ను ఉంటుంది
అలానే FRSBపై కూడా , ఐతే ట్యాక్స్ డిడక్షన్ నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్లకు వర్తిస్తుంది

 

ఐతే ఎంత గ్యారంటీ ఉన్నా కూడా వడ్డీ రేట్ల విషయంలో ఆకర్షణీయమైన ఈక్విటీలతో పోల్చితే తక్కువ కాబట్టి..మొత్తం ఆదాయాన్ని వీటిలోనే కాకుండా, ఓ పాతికశాతం పెట్టుబడిని వీటిలో పెట్టవచ్చనేది అనుభవజ్ఞుల సూచన


 


Expert's View


ఏ దేశ ద్రవ్యోల్బణం చూసినా ఏముంది గర్వకారణం ?

Trending