ఆర్‌బిఐకి బ్రేక్ వేసిన ఓమిక్రాన్..ట్యాప్ తిప్పే ఆలోచనకి స్వస్థి?

2021-12-04 14:34:48 By Anveshi

img

గత 9 సార్లుగా వడ్డీ రేట్లపై తగ్గింపే తప్ప పెంచడం అనే ఆలోచన జోలికే పోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ సారి మీటింగ్ లో మాత్రం ఆ దిశగా కదలవచ్చనే అంచనాలు ఉన్నాయ్. ఖచ్చితంగా ఎంతో కొంత వడ్డీరేట్ల పెంపు ఉండొచ్చని చాలామంది భావిస్తున్నారు..ఐతే ఆ ఆలోచనలకు బ్రేక్ వేసింది ఓమిక్రాన్ వేరియంట్

 

ప్రపంచవ్యాప్తంగా కొత్త వేరియంట్ కలకలం రేపుతుండగా, ఎకనమిక్ ఔట్‌లుక్ మార్చుకోవడం అంత ఈజీ కాదు ఇప్పుడిప్పుడే వృద్ధి సంకేతాలపై అన్ని దేశాల్లో సానుకూల స్పందనలు వస్తుండగా, B.1.1.529 వేరియంట్ వాటికి ప్రతికూలంగా మారొచ్చనే సూచనలు వచ్చాయ్. దీంతో ఇప్పటికిప్పుడు వడ్డీ రేట్లు పెంచడం అంత మంచిదా కాదా అనేది మన రిజర్వ్ బ్యాంక్ మానిటరీ పాలసీ కమిటీ ఆలోచించనుందంటున్నారు. 

 

కొత్త వేరియంట్ ప్రభావం ఇప్పటికిప్పుడు తేలేది కాదు. కనీసం ఓ నెల రోజుల తర్వాత కానీ నిజమైన ప్రభావం గురించి తెలీదు. అందుకే కొన్ని రంగాల్లో మాత్రమే గాడిన పడిన మన ఆర్థిక వ్యవస్థలో అప్పుడే ట్యాపరింగ్( కొళాయి కట్టేయడం) ప్రారంభిస్తే ప్రతికూల పరిణామాలు ఎదురు కావచ్చనేది కొంతమంది వాదన. అందుకే డిసెంబర్‌లో జరిగే మానిటరీ కమిటీ సమావేశం వడ్డీ రేట్ల పెంపు గురించి ఆలోచన చేయకపోవచ్చని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు
 


RBI TAP