లాభాల పంట పండిస్తోన్న ఫర్టిలైజర్ కంపెనీలు, ఒక్క వారంలో 68% జంప్- రీజన్ ఉంది గురూ!

2021-03-01 12:22:31 By Anveshi

img

గత వారం లాభాలను అందించిన ఫర్టిలైజర్ స్టాక్స్ ఈ వారం ఓపెనింగ్ సెషన్‌లోనూ అదరగొడుతున్నాయ్. 
బ్రాడ్ బేస్డ్ ర్యాలీని అందిపుచ్చుకుని ఇన్వెస్టర్లకు లాభాల దిగుబడి తెచ్చిపెడుతున్నాయ్. దీంతో మొత్తం మీద గత వారం  రోజులుగా ఈ సెగ్మెంట్ స్టాక్స్‌లో కొన్నిటి ధర 68శాతం వరకూ పెరిగింది

ఇవాళ ట్రేడింగ్‌లో ఆర్‌సిఎఫ్ 19శాతం పెరిగి రూ.90.45కి ఎగసింది. ఇది ఆ స్టాక్ 52వీక్స్ హై రేటు. ఇక్రా, ఆర్‌సిఎఫ్‌కి స్టేబుల్ నుంచి పాజిటివ్‌కి రేటింగ్ మార్చింది.ఇక మరో స్టాక్ నేషనల్ ఫర్టిలైజర్స్ ఏకంగా ఇవాళ అప్పర్ సర్క్యూట్ తాకింది. 20శాతం పెరిగి, రూ.63.70కి చేరింది. ఈ షేరు గత వారం రోజుల్లోనే 68శాతం పెరగడం విశేషం. ఉదయం 10.54 నిమిషాలకే ఈ కౌంటర్‌లో 2 కోట్ల 20లక్షల షేర్ల లావాదేవీలు జరగడం, స్పీడ్‌కి నిదర్శనం

బడ్జెట్‌లో అగ్రికల్చర్‌కి పెద్ద పీట వేయడం, సెంటిమెంట్ బావుండటంతో పాటు గత జిడిపిని వ్యవసాయరంగమే ఆదుకోవడం కూడా ఈ రంగ షేర్ల జోరుకు కారణాలుగా తెలుస్తోంది
పై రెండు షేర్లు మాత్రమే కాకుండా, జిఎస్ఎఫ్‌సి, జిఎన్‌ఎఫ్‌సి, రామా ఫాస్ఫేట్స్, మంగళూర్ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ షేర్లు కూడా గత వారం రోజుల్లో 20 నుంచి 33శాతం వరకూ పెరిగాయి


 

Expert's View


WHAT IS BITCOIN ? HOW TO INVEST IN CRYPTO CURRENCY ?

Trending