రష్యా ప్రసిడెంట్ టూర్‌తో మనకి కుదిరే డీల్స్ ఏంటి..? అమెరికాకి నచ్చకపోయినా సైలెంట్‌గా ఉండాల్సిందేనా

2021-12-05 14:54:01 By Anveshi

img

రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ సోమవారం మన దేశంలో టూర్ చేయబోతున్నారు. ఓ వైపు అమెరికా ఆంక్షలను పట్టించుకోకుండా మన దేశం ఆల్రెడీ S-400 రక్షణ వ్యవస్థలను కొనుగోలు చేసిన నేపథ్యంలో ఈ టూర్ ఎజెండా ఏంటనేది ప్రాథాన్యత సంతరించుకుంది.దాదాపు రెండేళ్ల క్రితం మన దేశంలో అమెరికా అప్పటి అధ్యక్షుడు ట్రంప్ టూర్ తర్వాత మన దేశంలో పర్యటిస్తున్న ఓ అగ్రరాజ్యాధిపతి పుతినే


రష్యాతో 5 బిలియన్ డాలర్ల ఒప్పందం  ఒక్క సుఖోయ్ 400 కొనుగోళ్లతోనే పూర్తైపోయింది. ఇక ఇప్పుడు కొత్తగా కుదుర్చుకునే డిఫెన్స్ డీల్స్ ఏమి ఉండొచ్చనే అంశం చర్చకు వస్తోంది. 

 

 ఐతే టర్కీ ఇలాంటి డీల్ ఒకటి రష్యాతో కుదుర్చుకోగానే, ఆ దేశంపై అమెరికా ఎఫ్ 35 జెట్ ఫైటర్ల ప్రోగ్రామ్ నుంచి తప్పించింది.ఐతే ఇదే తరహా వైఖరి మన దేశంపై అమెరికా తీసుకోకపోవచ్చనే టాక్ నడుస్తోంది.ఎందుకంటే ప్రస్తుతం ఆసియా ఫసిఫిక్ రీజియన్లో భారత్ ప్రాముఖ్యత అలానే క్వాడ్ గ్రూప్‌లో కీలకం కావడంతో ఇప్పట్లో భారత్ పై ఆంక్షలు విధించే సాహసం ఏ దేశం చేయకపోవచ్చు..దీనికి తోడు ఇప్పుడు కరోనా సీజన్‌లో ఓ రకంగా భారత దేశమే వ్యాక్సిన్లను ప్రపంచానికి చేరువచేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తోంది


కేంద్రంలోని మోదీప్రభుత్వానికి పుతిన్ టూర్, చైనాతో విబేధాల నేపథ్యంలో అవసరం. ఆయుధాల కొనుగోలు అనేది ఈ ఒక్క కారణంతో ఆవశ్యకంగా మారింది. అలానే ఆప్ఘనిస్తాన్ లోని తాలిబన్ ప్రభుత్వంపై అప్పర్ హ్యాండ్ సాధించాలంటే..రష్యా సహకారం అవసరం. అప్పర్ హ్యాండ్ కాకపోయినా,
మనకి చెడు చేసేలా వ్యవహరించకుండా..నిలువరించడంలో రష్యా బ్యాలెన్స్ రోల్ పోషిస్తుంది.

 

సుఖోయ్ 30, మిగ్ 29, టి-90 ట్యాంకులు, మరిన్ని ఈ టూర్ తర్వాత  ఇండియాకి విక్రయించేలా ఒప్పందాలు కుదరవచ్చు. అలానే ఏకే 203 రైఫిల్స్ 7లక్షల వరకూ ఇండియాలో తయారీకి కూడా పుతిన్ టూర్ ఒప్పందాల్లో కుదరవచ్చనేది తెలుస్తోంది. ఈ డీల్స్ పై అమెరికా అసంతృప్తిగా ఉన్నా సరే
దాన్ని ఓపెన్‌గా ఆంక్షల రూపంలో వెళ్లగక్కలేని పరిస్థితే ఉండొచ్చనేది ప్రాథమిక అంచనా


 


PUTIN MODI