ఏ క్యాహై 'జీ ' ? ముకేష్ అంబానీని వివాదంలోకి లాగిన పునీత్ గోయెంకా..! సంబంధం లేదన్న ఇన్వెస్కో!

2021-10-13 12:09:09 By Anveshi

img

జీ గ్రూప్ సంస్థ , తమ వాటాదారు అయిన ఇన్వెస్కోతో వివాదంలోకి రిలయన్స్ ఇండస్ట్రీని లాగింది. గతంలో ఇన్వెస్కో గ్రూప్ ఓ పెద్ద సంస్థతో విలీనానికి ప్రయత్నాలు చేసిందని పేరు పెట్టి చెప్పకుండా నిన్న( అక్టోబర్ 12న) పునీత్ గోయెంకా ఆరోపించారు. అసలు ఆ డీల్‌ని తాను తిరస్కరించినందుకే Md&CEO పదవి నుంచి తొలగించాలని చూస్తుందంటూ పెద్ద కలకలం రేపే ప్రయత్నం చేశారు

 

దేశంలోని ఓ పెద్ద కంపెనీతో వ్యూహాత్మక భాగస్వామ్యానికి సిద్ధం కావాలని..దానికి పునీత్ గోయెంకా ఉన్నా లేకపోయినా డీల్ ఓకే అవుతుందని ఇన్వెస్కో చెప్పినట్లుగా పునీత్ గోయెంకా ఆరోపించారు. ఐతే ఈ ఆరోపణలను ఇన్వెస్కో గ్రూప్ నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. కంపెనీ షేర్ హోల్డర్ల వేల్యూ కాపాడటమే తమ బాధ్యత అని, ఈ ఆరోపణలు నిరాధారం అంటూ తిరస్కరించింది. అంతేకాదు దీర్ఘకాలంలో జీ ప్రమోటర్లు, షేర్ హోల్డర్ల ప్రయోజనాలను పలుచన చేస్తున్నారంటూ తిప్పికొట్టింది. ఇప్పటిదాకా బోర్డ్ మీటింగ్ పెట్టకుండా ఎందుకు తిరస్కరిస్తుందో జీ ప్రమోటర్లే చెప్పాలంటూ ప్రశ్నించింది

 

సెప్టెంబర్ 11న ఇన్వెస్కో, జీగ్రూప్ అసాధారణ సమావేశం ఏర్పాటు చేయాల్సిందిగా ప్రమోటర్లకు లేఖ రాసింది. చైనా ఫండ్ తో కలిసి దాదాపు 18శాతం వాటా కలిగి ఉన్న ఈ రెండు భాగస్వామ్యులూ ఈ విషయంపై ఎన్‌సిఎల్‌టికి కూడా వెళ్లాయ్. ఐతే సోనీ కంపెనీ టేకోవర్ తర్వాత కూడా పునీత్ గోయెంకానే ఉన్నత పదవిలో కొనసాగడంపై ఇన్వెస్కో అభ్యంతరం చెప్తోంది. తాను ప్రపోజ్ చేసిన ఆరుగురిని డైరక్టర్లుగా నామినేట్ చేయాలని కోరుతుంది తప్ప, సోనీ డీల్‌పై ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. ఆ వ్యవహారం అలా సాగుతుండగానే, ఇలా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత పేరు మధ్యలో లేవనెత్తడంపై కలకలం బయలుదేరింది

 

ప్రస్తుతం జీ ఎంటర్‌టైన్‌మెంట్ షేర్లు రూ.310.40 వద్ద ట్రేడ్ అయ్యాయ్

 

 


ZEEL ZEE PUNEET GOENKA RELIANCE AMBANI MUKESH RALLY INVESCO DOWN

Expert's View


ఇన్వెస్టర్లకు ఎనలిస్టుల "దసరా మాములు" స్టాక్ రెకమెండేషన్స్

Trending