మార్కెట్లలో దసరా ధమాకా..! 18300 పాయింట్లకి నిఫ్టీ పయనం! మరోసారి కేక పుట్టించిన అనంతరం కాస్త నీరసించిన టాటా మోటర్స్

2021-10-14 10:54:24 By Anveshi

img

స్టాక్ మార్కెట్లలో బుల్స్ మరోసారి ఛార్జింగ్‌కి దిగడంతో పాత రికార్డులు పాతబడిపోయాయ్. నిఫ్టీ ఏకంగా 18300 పాయింట్లకు చేరింది. స్పాట్‌లో 18294 పాయింట్ల వద్ద రికార్డ్ క్రియేట్ చేసింది. అటు సెన్సెక్స్ కూడా 61వేల పాయింట్లను దాటేసింది. ఇంట్రాడేలో 61159 పాయింట్లకు ఎగసింది

 

మార్కెట్ల ర్యాలీకి బ్యాంక్ నిఫ్టీ , ఐటీ ఇండెక్స్ సపోర్ట్ చేస్తున్నాయ్. ఐటీ ఇండెక్స్ ఇప్పటికే ఓపెనింగ్‌లోనే 2.50శాతం వరకూ లాభపడింది. స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్ జోరుగా ట్రేడవుతుండగా, ఆటో స్టాక్స్‌లో ప్రాఫిట్ బుకింగ్ చోటు చేసుకుంది. కేపిటల్ గూడ్స్ భారీగా లాభపడుతుండగా, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ కొనుగోళ్లు కాస్త నెమ్మదించాయ్. ఎఫ్ఎంసిజి, హెల్త్‌కేర్ స్టాక్స్‌ ఫ్లాట్‌గా ట్రేడవుతుండగా, మెటల్ స్టాక్స్ మరోసారి భారీగా లాభపడుతున్నాయ్. ఆయిల్ అండ్ గ్యాస్, ,టెక్ షేర్లు మంచి గ్యాలప్‌పై ఉండగా,  పిఎస్ఈ స్టాక్స్ మరోసారి విజృంభిచేసాయ్

 

మార్కెట్లలో మొదటి గంటలో టాప్ గెయినర్లుగా విప్రో 6శాతం, అదానీ పోర్ట్స్ 3.85శాతం, లార్సెన్ అండ్ టుబ్రో 23.53శాతం, గ్రాసిం 3.19శాతం హిందాల్కో 2.82శాతం లాభపడి  ట్రేడర్లకు ఉత్సాహం పంచాయ్. 

 

ట్రేడర్లు  ప్రాఫిట్ బుకింగ్‌కి దిగడంతో లూజర్లలో టాటా మోటర్స్ స్టాక్ 2.31శాతం నష్టపోయింది. ఐతే ఆరంభంలో టాటామోటర్స్ మరోసారి కొత్త గరిష్టాన్ని రూ.530 వద్ద తాకింది. ఆ తర్వాతే స్టాక్ ధర రూ.492కి జారింది 


 కోల్ఇండియా 1.63శాతం, ఇండస్ఇండ్ బ్యాంక్ 1.39శాతం, బజాజ్ ఫైనాన్స్ 1.04శాతం, మహీంద్రా అండ్ మహీంద్రా 0.86శాతం లూజర్లుగా నిలిచాయ్ 


tata motors nifty gainers 18300

Expert's View


మంచి కంపెనీల IPO లకు ఎందుకు ఆదరణ కరువైంది ?

Trending