ఈ స్టాక్ బహు లాభ పోషక్- సింగిల్ డే రూ.733 ప్రాఫిట్

2021-03-02 13:44:53 By Anveshi

img

10 శాతం అప్పర్ సర్క్యూట్ 
2 రోజుల్లో 32శాతం జంప్
నెల రోజుల్లో 101శాతం
దుమ్ము రేపుతోన్న స్పెషాల్టీ కెమికల్ స్టాక్

 

లాభాలసాగులో అలుపు ఎరగకుండా సేద్యం చేసే మదుపరులకు తమకంటే పెద్ద సేద్యగాళ్లని చూస్తే వాళ్ల పోర్ట్ ఫోలియోల్లో ఏ స్టాక్‌పై ఎంత లాభం
తీస్తున్నారో అనే ఆసక్తి సహజంగానే ఎక్కువ. అలా రాకేష్ ఝన్‌ఝన్‌వాలా, పొరింజు వేలియాత్‌తో పాటు ఆశిష్ కచోలియావంటి ఏస్ ఇన్వెస్టర్లు
ఏ స్టాక్స్ కొన్నారో చూసి వాటినే బెట్ చేస్తుంటారు. అలా తాజాగా ఆశిష్ కచోలియా ఓ కంపెనీలో 1.40శాతానికి సమానమైన వాటాలు కొనుగోలు చేసారు.అది కూడా పరుగులు పెడుతుండటంతో..ఆ కౌంటర్‌పై జనం ఫోకస్ కూడా ఎక్కువగానే పడింది. అదే పోషక్..!

మరి ఇంతగా ఎందుకు షేరు ధర పరుగులు పెడుతోంది..?
కంపెనీ బిఎస్ఈకి చెప్పినదాని ప్రకారం ఎలాంటి కొత్త సమాచారం లేదు విశేషమూ లేదు, కంపెనీ విస్తరణ, సామర్థ్యం పెంపూ చేయడం లేదు.. డిసెంబర్ క్వార్టర్లో మాత్రం కంపెనీ స్టాండలోన్ నెట్ ప్రాఫిట్ మాత్రం రూ.11.54కోట్లు నమోదవడం గమనించాలి. నిర్వహణ ఆదాయం 36శాతం పెరిగి రూ.40.38కోట్లకి చేరింది. ఐతే కంపెనీ తయారు చేసే ఫాస్జీన్ అనే ప్రత్యేకమైన రసాయనం ఉత్పత్తిలో  దేశంలో ఇంకే కంపెనీ కూడా పోషక్ దరిదాపుల్లోకి రాదు. క్లోరోఫార్మేట్స్, ఐసోసయనేట్స్, కార్బోనేట్స్, ఫాస్జీన్ గ్యాస్ సహా అనేక స్పెషాల్టీ కెమికల్స్ రంగంలో పోషక్ నంబర్ వన్. ఈ ఉత్పత్తులన్నీ కూడా ఫార్మా రంగంలో పాటు వ్యవసాయ సంబంధిత క్రిమి సంహారకాల్లో బాగా వాడతారు.

షేర్ హోల్డింగ్ ప్యాటెెర్న్

గుజరాత్ బేస్ట్ అలెంబిక్ గ్రూప్ కంపెనీ పోషక్‌లో ప్రమోటర్ సంస్థకి 66.97శాతం వాటా ఉంది. పబ్లిక్ షేర్ హోల్డింగ్ 33.03శాతం వాటా ఉండగా..మిగిలిన 27.17శాతం రిటైల్ ఇండివిడ్యుల్ స్టాక్ హోల్డర్లది. ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ కి కూడా పోషక్ సంస్థలో 3.64శాతం వాటా ఉంది. కార్పొరేట్ బాండ్లకి 1.13శాతం హోల్డింగ్ ఉంది. 

స్టాక్‌కి ఫిబ్రవరి 17నే క్రిసిల్ పోషక్ సంస్థ బ్యాంకు రుణాలకు క్రిసిల్ A-స్టేబుల్ రేటింగ్ లాంగ్ టర్మ్ బేసిస్‌లో ఇచ్చింది. ఆర్థికంగా పటిష్టంగా ఉండటంతో పాటు నిర్వహణ సమర్ధత కలిగిన కంపెనీగా పేరు పొందింది. ప్రస్తుతం పోషక్ షేర్లు 10శాతం లాభపడి రూ. 8067.20వద్ద అప్పర్ సర్క్యూట్ లాక్ పడింది
 

Expert's View


WHAT IS BITCOIN ? HOW TO INVEST IN CRYPTO CURRENCY ?

Trending