బ్రేకింగ్ న్యూస్ ఫ్రాంక్లిన్ టెంపుల్‌టన్‌పై మనీలాండరింగ్ కేసు

2021-03-03 16:34:20 By Anveshi

img

అమాయ ఇన్వెస్టర్లను ముంచేసిన ఫ్రాంక్లిన్ టెంపుల్టన్
6 స్కీముల షట్‌డౌన్ వెనుక స్కామ్
ముందే పెట్టుబడి వెనక్కి తీసుకున్న వైనం
టాప్ అఫిషియల్స్ కాసుల కక్కుర్తి
పుట్ ఆప్షన్లలో గోల్‌మాల్

ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ మనీ లాండరింగ్ కేసు రిజిస్టర్ చేయడం కలకలం రేపుతోంది. సంస్థపైనా, అందులోని సీనియర్ అధికారులపైనా ఈడీ కేసు పెట్టింది. గత ఏప్రిల్ నెలలో 6 రకాలైన డెట్ స్కీములను ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ చెల్లింపుల అవకతవకలతో అకస్మాత్తుగా మూసేసింది. దీనికి సంబంధించి విచారణ అప్పట్నుంచీ సాగుతూ ఉండగా, నేడు చెన్నై పోలీస్ ఎకనమిక్ ఆఫెన్స్ వింగ్ ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈసిఐఆర్ ( కేసు) నమోదు చేసింది

చెన్నైలో ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఎఫ్ఐఆర్‌ను గత ఏడాది సెప్టెంబర్ 29నే సెక్షన్ 420 కింద నమోదు చేసింది. అమాయకులైన ఇన్వెస్టర్లను మోసం చేయడం, కుట్రపూరితంగా వ్యవహరించి ధనార్జన చేయడం వంటి ఆరోపణలతో సంస్థ సిఐఓపై కూడా ఛార్జ్ చేసింది ఈడీ.

అంతేకాదు, సంస్థ అనుచితంగా వ్యవహరించడంపై చోక్సీ అండ్ చోక్సీ అనే కంపెనీ చేత ఫోరెన్సిక్ ఆడిట్ చేయించగా..కంపెనీ 6 రకాల డెట్ ఫండ్స్ మూసివేయడానికి ముందు కంపెనీకి చెందిన టాప్ ర్యాంక్ అఫిషియల్స్ కనీసం 23సార్లు 53కోట్ల మేర డబ్బు విత్ డ్రా చేసినట్లు తేలింది. అది కూడా 2020 మార్చి నుంచి ఏప్రిల్ మధ్యలోనే! ఈ ఆరు రకాల డెట్ ఫండ్స్ మూయడానికి ముందే ఈ ఉన్నత ఉద్యోగుల ఇన్వెస్ట్ మెంట్స్ కూడా అమ్మేసుకున్నట్లు తేలడం మరో దారుణం. ఇప్పుడు ఈ రకంగా వాళ్లు కనుక ఏదైనా లాభం తెచ్చుకుని ఉంటే ఆ ధనాన్ని అంతా కూడా నేరపూరితంగానే చూస్తామని ఈడీ ప్రకటించింది. అలానే ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఉద్యోగులు పుట్ ఆప్షన్లను ఎందుకు వినియోగించలేదనే అంశంపై కూడా ఈడీ ఫోకస్ పెట్టబోతోంది. ఇలా చేయకుండా ఉండటానికి కూడా ఏమైనా ధనపరమైన వ్యవహారం ఉందా అనే విషయాన్ని కూడా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ దర్యాప్తు చేయబోతోంది. 

ఆప్షన్ ఎక్స్‌పైరీ అవడానికి ముందే నిర్దేశిత సంఖ్యలో సెక్యూరిటీల అమ్మకం చేయడమే పుట్ ఆప్షన్‌గా పరిగణిస్తారు. ఈడీ చర్యతో ఇప్పుడు 
ప్రాంక్లిన్ టెంపుల్టన్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయినట్లే. ప్రత్యేకించి కొంతమంది అధికారులు కొన్ని సంస్థలకి సంబంధించిన పుట్ ఆప్షన్లని మాత్రమే వినియోగించారు తప్ప, మిగిలినవాటి విషయంలో సరిగా వ్యవహరించలేదని, ఇది వారి చేతగానితనమా, లేక ఇంకేదైనా కుట్ర ఉందా అనే విషయాన్ని ఇప్పుడు కోర్టు ముందు తేలాల్సి ఉంది. 
 

Expert's View


WHAT IS BITCOIN ? HOW TO INVEST IN CRYPTO CURRENCY ?

Trending