మార్కెట్లకు స్వల్పలాభాలు..! దంచి కొట్టి టాప్ గేర్‌లో ట్రేడైన టాటా మోటర్స్ : 7% జంప్

2022-05-13 10:06:53 By Anveshi

img

మార్కెట్లు వరస నష్టాల సెషన్ల నుంచి కాస్త తేరుకున్నాయ్. ఇవాళ్టి ఓపెనింగ్‌లో నిఫ్టీ 220 పాయింట్లు లాభపడగా, సెన్సెక్స్ 700 పాయింట్లకిపైగా పెరిగింది.

 

నిఫ్టీ బ్యాంక్ అరశాతం లాభపడగా ఐటీ ఇండెక్స్  ఫ్లాట్‌గా ఉంది. మిగిలిన సెక్టార్లలో ఆటో , హెల్త్ కేర్, కేపిటల్ గూడ్స్ఆయిల్ అండ్ గ్యాస్ ఒకటిన్నరశాతంనుంచి రెండు శాతం వరకూ లాభపడ్డాయ్. మెటల్ స్టాక్స్ ఒకశాతంలోపే లాభపడగా, టెక్ షేర్లలో తిరిగి సెల్లింగ్ ప్రారంభమైంది

 

టాప్ గెయినర్లలో టాటా మోటర్స్, యుపిఎల్, సన్‌ఫార్మా, టైటన్, అపోలో హాస్పటల్స్ రెండున్నర నుంచి 7శాతం వరకూ లాభపడ్డాయ్. లూజర్లలో విప్రో,టిసిఎస్, భారతి ఎయిర్ టెల్, ఎన్‌టిపిసి, అల్ట్రాటెక్ సిమెంట్ అరశాతం నుంచి ఒక శాతం వరకూ నష్టపోయాయ్

 


Expert's View


ఏ దేశ ద్రవ్యోల్బణం చూసినా ఏముంది గర్వకారణం ?

Trending