భారత్ బయోటెక్‌కి అమెరికా ఝలక్..! వ్యాక్సిన్ స్టడీస్ ఫుల్ డీటైల్స్ కావాలంటూ మెలిక..! ఆక్యుజెన్‌కి పడిందిగా తడిక ! షేర్లు 28% డౌన్

2021-06-11 19:13:02 By Anveshi

img

కోవాగ్జిన్‌ని అమెరికాలో ఉత్పత్తి బాగా బిజినెస్ పెంచుకుందామనుకున్న ఆక్యుజెన్ కంపెనీకి పెద్ద షాక్ ఇచ్చింది అమెరికా  ఎఫ్‌డిఏ, ఇది ఓరకంగా భారత్ బయోటెక్‌కి కూడా అశనిపాతంగానే చూడాలి. ఎందుకంటే అమెరికాలో కోవాగ్జిన్ తయారు  చేసేందుకు తన భాగస్వామిగా చేసుకుంది ఈ ఆక్యుజెన్ కంపెనీనే. ఫుల్ బయోలాజికల్ లైసెన్స్ అప్లికేషన్స్ అప్రూవల్ కావాలంటే, మొత్తం డేటాని సమర్పించాలని కోరింది. దాంతో ఇప్పుడు ఆక్యుజెన్ మరోసారి ఇక్కడ క్లినికల్ ట్రయల్స్ చేయాల్సి వస్తుంది. దీనికి కనీసం మరో 7 నెలల సమయం పడుతుందని అంచనా. 

 


భారత్ బయోటెక్ కంపెనీ ఈ డెవలప్‌మెంట్‌పై ఏమీ పెదవి విప్పలేదు. అమెరికా ఎఫ్‌డిఏ కోరుతున్న అదనపు క్లినికల్ ట్రయల్, అమెరికాలోనే లోకల్‌గా ఓ బ్రిడ్జి ట్రయల్ కోరుతుందా లేక మొత్తం ఫేజ్ త్రీ ట్రయల్స్ కోరుతుందా అనేది స్పష్టత లేదు. ఈ  అంశంపైనే ఇప్పుడు ఎమర్జెన్సీ యూజ్ అప్రూవల్ ఆధారపడనుంది. అసలు అమెరికా ఫెడరల్ డ్రగ్ అథారిటీ ఓ బిఎల్ఏ-అంటే బయోలాజికల్ లైసెన్స్ అప్రూవల్ ఇవ్వాలంటే కనీసం పదినెలలు తీసుకుంటుందని అంచనా. ఐతే క్లినికల్ ట్రయల్స్ లేకుండానే
కోవాగ్జిన్‌కి అమెరికాలో భాగస్వామి ఉండటంతో వెంటనే వినియోగం ప్రారంభం అవుతుందనుకున్నారు. కనీసం రెండు మూడు నెలల్లో అయినా వ్యాపారం చేయవచ్చనుకుంటే, ఇప్పుడీ తాజా పరిణామం అటు అక్యూజెన్‌కు ఇటు భారత్ బయోటెక్‌కి రెండు సంస్థలకీ మింగుడపడని పరిణామమే!

 

ఇలా ఈ న్యూస్ లీకైందో లేదో..వెంటనే సన్నాయి నొక్కులు ప్రారంభం అయ్యాయ్ భారత్‌లో..అసలు భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాగ్జిన్‌లో ఏదో తేడా ఉందనిపిస్తుందని అరుణ్ భట్ అనే ఎథిక్స్ కన్సల్టెంట్ అభిప్రాయపడ్డాడు. అసలు భారత్ బయోటెక్ అప్రోచ్ అయిన విధానంలో కూడా తేడా ఉండొచ్చంటాడాయన


భారత్ బయోటెక్ చెప్తున్నదాని ప్రకారం, ఆ సంస్థ తయారు చేసిన టీకాకి 14 దేశాలు ఎమర్జెన్సీ యూజ్‌కి అనుమతి ఇచ్చాయి. అలానే మరో 50 దేశాల్లో అనుమతి ప్రక్రియ జరుగుతోంది. అంతేకాదు..ఇంతవరకూ ఏ టీకాకి కూడా అమెరికాలో ఫుల్ లైసెన్స్ ఇవ్వలేదని..ఇస్తే కనుక అదో పెద్ద ముందడుగుగా చెప్తోంది ఇప్పటిదాకా భారత్ బయోటెక్ తన క్లినికల్ ట్రయల్స్ ఫేజ్ త్రీలోని మధ్యంతర డేటా ఆధారంగా లైసెన్స్ కోసం ధరఖాస్తు చేసింది. దీని ప్రకారం ఈ టీకా సమర్ధత 78శాతం మొత్తం డేటాని జులైలో ప్రచురిస్తామని చెప్తోంది. 

మరి తేడా ఏంటి

అన్ని దేశాల్లోలానే అమెరికాలో కూడా అనుమతుల సంస్థలు..అత్యవసర పరిస్థితుల్లో ఫుల్ డేటా అందుబాటులో లేకపోయినా ఒక్కోసారి టీకాలు, మందుల వాడకానికి అనుమతి పరిమితంగా ఇస్తాయి. ఐతే ఒక్కోసారి ఫుల్ డేటా కూడా అడుగుతాయి. అలా  USFDA భారత్ బయోటెక్ కి చెందిన కోవాగ్జిన్ డేటా అడిగింది. దీంతో సాఫీగా వెంటనే వ్యాక్సిన్ తయారు చేసి డోసులు పంపిణీ చేద్దామనుకున్న ఆక్యుజెన్-భారత్ బయోటెక్ ఉత్సాహంపై నీళ్లు చల్లినట్లైంది. ఐతే ఇది తమ టీకాని రిజెక్ట్ చేసినట్లు కాదని భారత్ బయోటెక్ స్పష్టంగా చెప్తోంది.అది వాస్తవం. ఐతే..ఇలా ఫుల్ డేటా కోసం ఎఫ్‌డిఏ కోరిందంటే అవి పూర్తయ్యేసరికి 7 నెలలు కూడా పట్టాల్సి రావడమే అక్యుజెన్‌కి షాక్ ఇస్తోంది. దీంతో ఆ సంస్థ షేర్లు 28శాతం క్రాష్ అయ్యాయ్. 6.69డాలర్లకు కూడా దిగివచ్చాయ్. 


USFDA COVAXIN BLA VACCINE OCUGEN ARUNBHATT FULL DATA CLINICAL TRAILS NEW ADDITIONAL SHOCK SHARES DOWN TELUGU

Expert's View


నేను వేసుకున్న కోటు రంగు , రానున్న రోజుల్లో మార్కెట్ల రంగు ఇదేనా ?

Trending