మార్కెట్ ఎంత పడ్డా నైకా మాత్రం పైకే..! 7% జంప్ చేసిన షేరు ధర, ఏం ర్యాలీ బాసూ..!

2021-11-26 11:52:51 By Anveshi

img

శుక్రవారం మార్కెట్లలో మహా పతనం చోటు చేసుకుంది. నిఫ్టీ ఓకంగా 450 పాయింట్ల వరకూ నష్టపోగా, సెన్సెక్స్ 1450 పాయింట్లు కోల్పోయింది. 

 

నైకా షేర్లు మాత్రం ఏ మాత్రం తగ్గకుండా రూ.2529 వద్ద ట్రేడ్ అవుతున్నాయ్. డే హై  వద్ద మరోసారి ఈ గరిష్టాన్ని సవరించే దిశగా దూసుకుపోతున్నాయ్. ఉదయం 11 గంటలకు ఇంట్రాడేలో 6శాతం వరకూ పెరిగి రూ.2529 ధరని చేరుకుని కొత్త 52 వారాల గరిష్టాన్ని సృష్టించగా లిస్టింగ్ రోజున రూ.2వేలకి పైనే ట్రేడవగా ఆ రేటు ఎక్కడా తగ్గలేదు. ఈ నైకా షేర్ల అలాట్‌మెంట్ ధర రూ.970 మాత్రమే

 

ఇవాళ ఈ కౌంటర్లో ఉదయం 11 గంటల సమయానికే 18లక్షల షేర్ల లావాదేవీలు చోటు చేసుకున్నాయ్
కథనం రాస్తుండగానే నైకా షేర్లు మరోసారి విజృంభించి రూ.2573కి ఎగశాయి. అలా ఇంట్రాడేలో 7శాతం ర్యాలీ చేశాయ్  ఎఫ్ఎస్ఎన్ ఈ కామర్స్ షేర్లు


NYKAA

Expert's View


మంచి కంపెనీల IPO లకు ఎందుకు ఆదరణ కరువైంది ?

Trending