ఓయ్ కాకా ! మిస్ కాకూడని ఐపిఓ నైకా..! బాక్సాఫీస్ బొనాంజా రేంజ్ రెస్పాన్స్ ఖాయం

2021-10-23 11:39:40 By Anveshi

img

భారీ వేల్యేషన్‌పై కన్నేసిన నైకా
7.4 బిలియన్ డాలర్ల వేల్యేషన్ 
అక్టోబర్ 28 నుంచి నవంబర్ 1 వరకూ ఐపిఓ ఇష్యూ ఓపెన్
నవంబర్ 8న షేర్ల అలాట్‌మెంట్
నవంబర్9న రిఫండ్ ప్రాసెస్
నవంబర్ 10న డీమ్యాట్ అక్కౌంట్లలోకి నైకా షేర్ల చేరిక
నవంబర్ 11న లిస్టింగ్
ప్రైస్ బ్యాండ్-రూ.1085-1125

 

ప్రీమియం బ్యూటీ వెల్‌నెస్ ఉత్పత్తుల్లో పేరెన్నికగన్న నైకా..ఐపిఓకి కౌంట్ ప్రారంభమైంది. రూ.5200కోట్ల విలువ కలిగిన నిధులను సమీకరించేందుకు ఈ కంపెనీ ఐపిఓకి వస్తోంది. వీటిలో రూ.630కోట్ల మేర  43.11 మిలియన్ షేర్లనుఆఫర్ ఫర్ సేల్ పద్దతిలో విక్రయించనున్నారు. అక్టోబర్ 28 నుంచి ఐపిఓ 
ఓపెన్ కానుంది. ప్రస్తుతం ఉన్న ట్రెండ్‌ని బట్టి చూస్తే...ఈ ఐపిఓకి రెస్పాన్స్ భారీగా ఉండటం ఖాయం

 

ఐపిఓ ప్రైస్ బ్యాండ్ చూస్తే రూ.1085-1125 మధ్యలో ఫిక్స్ చేయగా, ఈ రేటు జనరల్ రిటైల్ ఇన్వెస్టర్లకి కాస్త భారంగా ఉన్నా..సంస్థ వేల్యేషన్ పరంగా చూస్తే పెద్ద ఎక్కువేం కాదు. నైకాని ఫల్గుణి నాయర్ ఫ్యామిలీ ప్రమోట్ చేయగా, ప్రవేట్ ఈక్విటీ సంస్థ టిపిజి వెనకుండి మద్దతు ఇస్తోంది. ఈ టిపిజి సంస్థ మీకు గుర్తుండే ఉంటుంది. టాటామోటర్స్ ఈవీ విభాగంలో పదకొండు శాతం వాటాకి వన్ బిలియన్ డాలర్లు ఖర్చు పెట్టింది ఈ ఈక్విటీ సంస్థనే

 

ఐతే అక్టోబర్ 28 కి ముందే నైకాలో ఇంకొన్ని కీలకమైన డెవలప్‌మెంట్స్ చోటు చేసుకోనున్నాయ్. అక్టోబర్ 27నే యాంకర్ ప్లేస్‌మెంట్ కింద రూ.2340 కోట్ల మేర వాటాలు కేటాయించనుంది నైకా. నవంబర్ 1న ఐపిఓ క్లోజ్ అవనుంది

 

ఆఫర్ ఫర్ సేల్ పద్దతిలో వాటాలని విక్రయించే ఫండర్లలో టిపిజి, లైట్ హౌస్ ఇండియా, జెఎం ఫైనాన్షియల్, యోగేజ్ ఏజెన్సీస్‌తో పాటు, సునీల్ కాంత్ ముంజాల్ హరీందర్‍‌పాల్ సింగ్ బంగా, నరోత్త శేఖ్సారియా, మాలా గావోంకర్‌తో పాటు సంజయ్ నాయర్ ఫ్యామిలీ ట్రస్ట్ కూడా 4.8 మిలియన్ షేర్లను విక్రయించనుండగా, ఫల్గుణి నాయర్ కుటుంబానికి ఐపిఓ తర్వాత కూడా మేజర్ వాటానే ఉండబోతోంది. ప్రస్తుతం నాయర్ ఫ్యామిలికీ  ఎఫ్ఎస్ఎన్ ఈ-కామర్స్ వెంచర్స్ పేరిట నైకాలో  53శాతం వాటా ఉంది. 

( నైకా ఫౌండర్ ఫల్గుణి నాయర్)

నైకా ఘనతల విషయానికి వస్తే, దేశంలో లాభాలబాటలో సాగుతున్న అతి కొద్ది ఈ-టైలర్ కంపెనీల్లో ఒకటి. గత ఆర్ధిక సంవత్సరంలో నైకా రూ.61.96కోట్ల లాభం గడించింది. అంతకి ముందటి ఏడాదిలో నైకాకి 16.34కోట్ల నష్టాలు వాటిల్లడం గమనార్హం. 2021 ఆర్ధిక సంవత్సరంలో నైకా 38శాతం వృద్ధి రేటుతో
2453 కోట్ల ఆదాయం ఆర్జించింది. ఇక ఐపిఓ ద్వారా వచ్చిన సొమ్ములో 130 కోట్లని తన అప్పుని తీర్చుకునేందుకు, 200కోట్లని నైకా బ్రాండ్లను ప్రమోట్ చేసేందుకు వినియోగించబోతోంది. 200 కోట్ల రూపాయలను తన ప్రమోషన్‌కే వాడనుండటం ఓ విశేషంగా చూడాల్సి ఉంది. మన గత మెడ్‌ప్లస్ గురించిన కథనంలో ఆ సంస్థ గత ఐదేళ్లలో తన పబ్లిసిటీకి కేవలం 15 కోట్లని మాత్రమే ఖర్చు పెట్టారని ఉదహరించడం గమనించాలి.  అంటే రాబోయే రోజుల్లో నైకా యాడ్స్ మన ఛానల్స్‌ని  ఏరేంజ్‌లో ముంతెత్తుతాయో ఊహించుకోండి. ఇప్పటికే నైకాకి హాట్ బ్యూటీస్ కత్రినా కైఫ్, జాన్వీ కపూర్‌లు బ్రాండ్ అంబాసిడర్లు కావడంతో ఈ ఉత్పత్తులు జనంలోకి బాగా చొచ్చుకుపోయాయ్

నైకా ప్రొడక్ట్స్ రేంజ్ చూస్తే..బ్యూటీ,వెల్ నెస్, హెల్త్ ప్రొడక్ట్స్ ఉన్నాయ్. ఇవి నిజంగానే చాలా చాలా అద్భుతమైనవిగా యూజర్లు చెప్తుంటారు. అందులోనూ ఆరోమా ఆయిల్స్ కేటగరీ అయితే సూపర్. ఈ నైకా ఐపిఓతో ఇక ఈ-రిటైల్ సంస్థల వాటర్‌షెడ్ మూమెంట్ ప్రారంభమవుతుందనే అంచనాలు ఉన్నాయ్

 

అందరికంటే ముందుగా నైకా ఐపిఓ డీటైల్స్ ఇస్తోంది ప్రాఫిట్ యువర్ ట్రేడ్ మాత్రమే


NYKA IPO FALGUNI NAYAR DETAILS UNICORN

Expert's View


మంచి కంపెనీల IPO లకు ఎందుకు ఆదరణ కరువైంది ?

Trending