షార్ట్ కవరింగ్‌తో భారీ ర్యాలీ.. నవంబర్ సిరీస్ క్లోజ్! దంచి కొట్టిన రిలయన్స్, వేదాంత, వొడాఫోన్ ఐడియా

2021-11-25 16:26:56 By Anveshi

img


గ్లోబల్ క్యూస్ వీక్‌గా ఉన్నా , ద్రవ్యోల్బణం భయపెడుతూనే ఉన్నా..మార్కెట్లు నవంబర్ సిరీస్ చివరి రోజున లాభాల్లో ముగిశాయ్. నిఫ్టీ 121 పాయింట్ల లాభంతో 17536 పాయింట్ల వద్ద, సెన్సెక్స్ 454 పాయింట్ల లాభంతో 58795 పాయింట్ల వద్ద ముగిశాయ్. దీంతో వరసగా అక్టోబర్, నవంబర్ సిరీస్ రెండూ కూడా 18వేల పాయింట్ల దిగువనే ముగిసినట్లైంది. ఆల్‌టైమ్ రికార్డ్ హై లెవల్ నుంచి వెయ్యి పాయింట్లను నిఫ్టీ కోల్పోగా, ఈ రెండు నెలలూ అక్కడక్కడే ట్రేడ్ సాగుతోంది తప్ప..వాటిని అధిగమించలేకపోయింది నిఫ్టీ

 

ఈ రోజు ట్రేడింగ్ హైలైట్ చూస్తే, బ్యాంక్ నిఫ్టీ, ఆటో, కేపిటల్ గూడ్స్, మినహా అన్ని సెక్టార్లూ లాభాల్లో ట్రేడ్ అయ్యాయ్.ఆయిల్ అండ్ గ్యాస్, హెల్త్‌కేర్ సెక్టార్ షేర్లలో ర్యాలీ చోటు చేసుకుంది.

 

మార్కెట్ల ర్యాలీకి రిలయన్స్ ఇండస్ట్రీస్ జోరుతో పాటు, షార్ట్ కవరింగ్ బాగా సాయపడినట్లు తెలుస్తోంది
మరోవైపు వేదాంత స్టాక్, వొడాఫోన్ ఐడియా చెరో 6శాతం ర్యాలీ చేసి ట్రేడర్లకు పండగ తెచ్చాయ్

 

ట్రేడింగ్ ముగిసే సమయానికి టాప్ గెయినర్లుగా రిలయన్స్, దివీస్ ల్యాబ్స్, ఐటిసి, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా 6 నుంచి 1.30శాతం వరకూ లాభపడగా, లూజర్లుగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, బ్రిటానియా, మారుతి సుజికి ఐసిఐసిఐ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్ 1.53 శాతం నుంచి 1.23శాతం వరకూ నష్టపోయాయ్
 


VEDANTA IDEA RIL RALLY NOVEMBER

Expert's View


మంచి కంపెనీల IPO లకు ఎందుకు ఆదరణ కరువైంది ?

Trending