మార్కెట్లపై ఎవర్‌గ్రనేడ్ బాంబ్ పడుతుందా?6 నెలల తర్వాత నిఫ్టీ ఎలా ఉంటుంది..?15వేలా-20వేల పాయింట్ల దగ్గరా?

2021-09-26 12:29:53 By Anveshi

img

మన మార్కెట్లు బ్రహ్మాండంగా వర్కౌట్ అవుతున్నాయ్. ప్రతి రికార్డును అధిగమిస్తూ..దూసుకుపోతున్నాయ్. ఇలాంటి దశలో కరెక్షన్ వస్తే గిస్తే ఏమవుతుందనేది చాలా మంది ఆలోచిస్తున్నారు. ఇలాంటి తరుణంలో కోటక్ మహీంద్రా ఏఏంసి నీలేష్ షా అంచనా మాత్రం వేరుగా ఉంది. ఇండియన్ మార్కెట్ల ఫండమెంటల్స్ మాత్రమే కాస్త ఆందోళన కలిగించే అంశం తప్ప..ఎవర్‌గ్రనేడ్ కానీ, మరో అంశం కానీ బుల్ రన్‌ని ఆపలేవంటారాయన

 

ముందుగా ఎవర్‌గ్రనేడ్ అనే అంశం కేవలం చైనాకి సంబంధించినదని..చైనా లేమాన్ బ్రదర్స్ మూమెంట్ లాంటిదే తప్ప..ప్రపంచవ్యాప్తంగా ఆ ప్రకంపనలు తక్కువని నీలేష్ షా అభిప్రాయం. ఓ వేళ ఇతర మార్కెట్లపై ప్రభావం చూపినా, అది తాత్కాలికం అంటారు.  ఐతే మార్కెట్ల కరెక్షన్‌కి అది ఓ కేటలిస్ట్‌, అంటే వేగవంతం చేసే ఓ సాధనంగా మారొచ్చు తప్ప దాని గురించి పట్టించుకోనక్కర్లేదు

 

6 నెలల తర్వాత మార్కెట్ ఎలా ఉంటుంది
ఫెయిర్ వేల్యేషన్స్‌తో ఉన్న మార్కెట్లు మనవి. రాబోయే ఆర్థిక ఫలితాలు, కోవిడ్ కేసులు తగ్గడం, తగినంత ధనం (లిక్విడిటీ) అందుబాటులో ఉండటం ప్లస్ పాయింట్లు. నిఫ్టీ 15వేల పాయింట్ల దగ్గర ఉంటుందా, లేక 20వేల పాయింట్లకు ఎగయనుందా అనేది చెప్పడం కష్టం..ఐతే పాజిటివ్‌గానే మార్కెట్ల పయనం ఉంటుందనేది ఎక్కువమంది అభిప్రాయం

 

చాలినంత డబ్బు అందుబాటులో ఉండటం, ద్రవ్యోల్బణం, రిటైల్ ఇన్వెస్టర్ల పార్టిసిపేషన్ ఈ మూడు రిస్క్ గా అస్సలు  చూడవద్దనేది నీలేష్ షా అభిప్రాయం

 

మార్కెట్ల గురించి హెచ్చరికలు చేసేవాళ్లు కూడా ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయాలనే కోరుకోవడం గమనించాలి. ప్రొడక్ట్ లింక్డ్స్ ఇన్సెంటివ్ స్కీమ్ సరైన దిశలో పని చేస్తే..నిజంగానే చైనాకి ప్రత్యామ్నాయంగా మారొచ్చు

 

వడ్డీ రేట్లపై ఫెడ్ ఎఫెక్ట్
వడ్డీ రేట్ల తగ్గింపును నిలిపివేయడం అనేది ముందుగా క్రిప్టో కరెన్సీలు, అవ్యవస్థీకృత పెట్టుబడులకే దెబ్బ. అధికంగా అవసరానికి మించిన వేల్యేషన్స్ ఇంతవరకూ స్టాక్ మార్కెట్ ఎంటిటీల్లో చోటు చేసుకోలేదు. అందుకే ఈ దెబ్బ చివరిగా మాత్రమే ఈక్విటీలపై పడుతుంది. అలానే డెట్ సెక్యూరిటీలవైపు పెట్టుబడి కూడా, ఇంతకు ముందు ఎలాగైతే ఇన్వెస్టర్లు తమ రిస్క్ ప్రొఫైల్ ని బట్టి పెట్టుబడుల కేటాయింపు చేసుకున్నారో..ఇప్పుడూ అలానే చేసుకోవాలి.అంతే తప్ప కొత్త జాగ్రత్తలేం
అవసరం లేదు


పై అభిప్రాయాలను బట్టి చూస్తే..మార్కెట్లకు రాబోయే రోజుల్లో పెద్దగా గడ్డు పరిస్థితులేం ఎదురుకావని అర్ధమవుతుంది. అమెరికాలో వడ్డీ రేట్లు పెరిగితే, మన మార్కెట్లపై కొత్త ప్రభావం ఉండదు. అలానే చైనాలో ఎవర్‌గ్రనేడ్ సంక్షోభం తలెత్తినా, దాన్ని మన మార్కెట్లకు పాజిటివ్‌గానే మార్చుకోవచ్చు. చైనా-అమెరికా ట్రేడ్ వార్ కానీ మరో పరిణామం కానీ మన మార్కెట్లను మరింత ఆకర్షణీయంగా మారుస్తాయే తప్ప పతనం దిశగా కరెక్షన్ చోటు చేసుకుంటుందని ఆశించడం కల్ల అని అర్ధమవుతోంది
 


fed effect evergranade china nlesh shah kotakamc

Expert's View


ఇన్వెస్టర్లకు ఎనలిస్టుల "దసరా మాములు" స్టాక్ రెకమెండేషన్స్

Trending