NMDC రిజల్ట్స్ ఎలా ఉంటాయ్..? ఇప్పుడున్న రేటులో మంచి రిటన్స్ ఇస్తుందా..?

2021-10-24 12:23:18 By Anveshi

img

నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ రిజల్ట్స్ ప్రకటించడానికి సిద్ధమైంది. ఈ తరుణంలో ఇప్పుడున్న వేల్యేషన్స్ ప్రకారం ఎన్ఎండిసి స్టాక్ కొనుగోలు చేయడానికి చాలా అవకాశముందని అనలిస్టులు చెప్తున్నారు. ఇప్పటికే చాలాసార్లు ఈ స్టాక్‌పై రికమండేషన్స్ వచ్చినా, రీసెంట్ కరెక్షన్‌తో ఇక లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లకు కూడా ఎన్‌ఎండిసి, మంచి ఎంట్రీ పాయింట్ దొరికిందనేది వారి అభిప్రాయం

 

పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్ సంస్థగా ఎన్‌ఎండిసికి దేశంలోని గనులు, తవ్వకాలకు సంబంధించిన పూర్తి అధారిటీ ఉంది. ఏ రాష్టాల్లో ఏ కంపెనీలకు మైనింగ్ లీజు ఇచ్చినా రాయల్టీ ఫీజులు ఎన్ఎండిసికే దక్కుతాయ్. అంతేగాకుండా, స్వయంగా ఎన్ఎండిసి కూడా మైనింగ్ కార్యకలాపాలు చేపడుతుంది
గత ఐదారునెలలుగా ఐరన్ ఓర్( ఇనుము ముడి ఖనిజం) ధర టన్నుకు 230 డాలర్లకు చేరింది. ఐతే ఈ మధ్యనే ఆల్ టైమ్ హై రేటు నుంచి 55శాతం పడిపోయింది.అంటే సగమైంది. అయినా సరే తిరిగి 103 డాలర్ల రేటు నుంచి కోలుకుని 122 డాలర్లకు టన్ను ఇనుప ముడి ఖనిజం ధర చేసింది

 

ఐసిఐసిఐ డైరక్ట్ అంచనా ప్రకారం ఈ క్యు2లో ఎన్ఎండిసి అమ్మకాలు రూ.5944కోట్లుగా నమోదై, రూ.2074కోట్ల నికరలాభం గడిస్తుందని చెప్తోంది.ఈ లాభం 168శాతం వృద్ధితో సమానం. ఐతే ఈ అమ్మకాలు క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్‌లో చూస్తే 9శాతం తగ్గుతాయ్. అలానే లాభం కూడా
35శాతం తగ్గుతుంది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ అంటే , క్యు2కి ముందటి క్యు1 ఫలితాలతో పోల్చితే అన్నమాట.


ఈ దశలో ఎన్ఎండిసి క్యు2లో  ఆర్ధిక ఫలితాలకి ముందే  స్టాక్ ధర రూ.142.25 వద్ద ఉండగా
ఇది చాలా తక్కువ రేటని అండర్ పెర్ఫామర్‌గా NMDC స్టాక్‌ని వర్ణిస్తున్నారు అనలిస్టులు. దానికి తోడు గత నెలరోజుల్షో షేరు రేటు ఇంకా పడిపోవడంతో ఇప్పుడు కొంటే రిటన్స్ చక్కగా ఉంటాయంటూ ఊరిస్తున్నారు

 

ఎన్ఎండిసి స్టాక్ 52 వీక్స్ హై ప్రైస్ రూ.213.20 కాగా, 52 వీక్స్ లోయెస్ట్ ప్రైస్ రూ.79.40


NMDC FY22 Q2 RESULTS

Expert's View


మంచి కంపెనీల IPO లకు ఎందుకు ఆదరణ కరువైంది ?

Trending