బేర్స్‌ని చితకబాదిన బుల్స్ ! 15100 పాయింట్లపైన నిఫ్టీ ముగింపు..! రాక్‌స్టెడీ మార్కెట్స్‌కి రెండే రీజన్స్ !

2021-05-18 16:12:36 By Anveshi

img

స్టాక్ మార్కెట్లలో మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం ముగింపు వరకూ నిఫ్టీ, సెన్సెక్స్ ఎక్కడా తడబడలేదు. అన్ని రంగాల షేర్లూ కలసికట్టుగా రాణించడంతో సూచీలలలో ఎక్కడా బలహీనత కన్పించలేదు. దీంతో నిఫ్టీ డే హై మార్క్ అయిన 15137 పాయింట్లకి కాస్త దిగువనే క్లోజ్ అయింది. 

 

దీంతో నిఫ్టీ దాదాపు 185 పాయింట్లు పెరిగి 15108 పాయింట్లపైన క్లోజ్ అవగా, సెన్సెక్స్  ఇంట్రాడేలో 713 పాయింట్లకిపైగానే  పెరిగింది. ఓ దశలో 50313 పాయింట్లకు చేరింది.చివరకు 612 పాయింట్ల లాభంతో 50193 పాయింట్ల వద్ద ముగిసింది.  వరసగా భారీ లాభాల్లో ముగియడం అందులోనూ 15వేల పాయింట్ల మార్క్‌ని అవలీలగా దాటేసి ఇంకో వంద పాయింట్లు  అదనంగా చేర్చి మరీ నిఫ్టీ క్లోజ్ అవడంతో ట్రెండ్ పూర్తిగా బుల్స్ చేతిలోకి వచ్చినట్లైంది. బేర్స్‌ని బుల్స్ చితకబాదడంతో పాటే  మరోసారి మార్కెట్ కేపిటలైజేషన్ కూడా  కొత్త రికార్డు క్రియేట్ చేసింది. బిఎస్ఈ లిస్టెడ్ సంస్థల మార్కెట్ కేపిటలైజేషన్  216లక్షలకోట్ల రూపాయలను అధిగమించింది. మొత్తం లిస్టెడ్ కంపెనీల M-cap రూ.216,38,957.10కోట్లకి చేరింది

 

నిఫ్టీ బ్యాంక్ 463 పాయింట్లు పెరిగి 33922 పాయింట్ల వద్ద క్లోజైంది. ఐటీ ఇండెక్స్ 254 పాయింట్లు, స్మాల్ అండ్  మిడ్‌క్యాప్ సూచీలు 300,418 పాయింట్లు పెరగగా, ఆటో ఇండెక్స్ కేపిటల్ గూడ్స్ మరోసారి కేక పుట్టించాయ్. కన్జ్యూమర్  డ్యూరబుల్ స్టాక్స్‌ సూచీ పరుగుకైతే పట్టపగ్గాలు లేకుండా పోయాయ్. ఏకంగా 783 పాయింట్లు ఈ సూచీ లాభపడిందంటే ఈ సెక్టార్ షేర్లలో ఎలాంటి ర్యాలీ నడిచిందో అర్ధం చేసుకోవచ్చు. మెటల్స్, ఆయిల్ అండ్ గ్యాస్, హెల్త్ కేర్ సహా అన్ని రంగాలు లాభాల్లోనే ట్రేడవగా ఒక్క ఎఫ్ఎంసిజి ఇండెక్స్ మాత్రం కాస్త లాభాల స్వీకరణకు లోనైంది

 

ఇవాళ భారీగా, బీభత్సంగా పెరిగిన కన్జ్యూమర్ డ్యూరబుల్ రంగ స్టాక్స్‌లో టైటన్ 4.89శాతం , బజాజ్ ఎలక్ట్రిక్ 2.26శాతం  ఆంబర్ ఎంటర్‌ప్రైజెస్ 2.21శాతం, టిటికె ప్రెస్టీజ్ 1.75శాతం, వోల్టాస్ 2.54శాతం లాభపడ్డాయ్.

 

మరోవైపు నిఫ్టీ టాప్ 5 గెయినర్లలో మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఆటో, టైటన్ కంపెనీ, బజాజ్ ఫైనాన్స్, టాటా మోటర్స్ 5.86శాతం నుంచి 3.53శాతం లాభపడ్డాయి.టాప్ 5  లూజర్లలో భారతి ఎయిర్‌టెల్, ఐటిసి, కోల్ఇండియా, డా.రెడ్డీస్ ల్యాబ్స్, దివీస్ ల్యాబ్స్ 2.42శాతం నుంచి 0.48శాతం నష్టపోయాయ్.

 

మార్కెట్ల లాభాలకు కరోనా కౌంట్ తగ్గడంతోపాటు భారత వృద్ధిపై కొన్ని మెరుగైన అంచనాలు కూడా కారణంగా చెప్తున్నారు. దీనికి తోడు అంతర్జాతీయ మార్కెట్లు కూడా భారీగా పెరుగుతున్న క్రమంలో అదే ట్రెండ్ మన మార్కెట్లలో కూడా రిఫ్లెక్ట్  అవుతుందనేది అనలిస్టుల అభిప్రాయం


closing report bell nifty ends higher 15100 15018 sensex rally bse m-cap telugu profit trade

Expert's View


నేను వేసుకున్న కోటు రంగు , రానున్న రోజుల్లో మార్కెట్ల రంగు ఇదేనా ?

Trending