మెరిసే...మెటల్స్ ..మురిసే మార్కెట్స్ ! నిఫ్టీ, సెన్సెక్స్@15800 ఆల్‌టైమ్ రికార్డ్స్ ! ఇరగదీసిన ప్రిసిషన్,క్యూబెక్స్

2021-06-11 10:49:19 By Anveshi

img

స్టాక్ మార్కెట్లలో బుల్ రైడ్ ప్రభంజనంలా సాగుతోంది. ఎక్కడికక్కడ బ్రేక్ పడుతుందనుకునే బేర్స్ ఆశలపై నీళ్లు జల్లుతూ సూచీలు దూసుకుపోతున్నాయ్.పంతం పట్టా చూడండి ఆపలేడు నన్నెవడూ అన్నట్లుగా బుల్ రన్ కొనసాగుతోంది. శుక్రవారం( జూన్ 11,2021)ని మార్కెట్లతో పాటు మదుపరులు కూడా గుర్తు పెట్టుకోవాలి, ఎందుకంటే ఆల్ టైమ్ గరిష్టమైన( పాత గరిష్టం) 15431 పాయింట్లను అధిగమించిన తర్వాత దానికి  ఖచ్చితంగా 400 పాయింట్ల తేడాతో అధిగమించిన రోజు ఇది
నిఫ్టీ ఇంట్రాడేలో 15835 పాయింట్లకు ఎగసింది.

 

మరోవైపు సెన్సెక్స్ కూడా తన పాతరికార్డులను తుడిచిపెట్టేసింది. 52,626 పాయింట్లకి ఎగసింది. గతంలో ఎంత హయ్యెస్ట్ మార్క్ అనేది ఇక మర్చిపోవాల్సిందే. ఏదైనా కొత్త గరిష్టమంటే అది 53వేలైతేనే..! 

 

మార్కెట్ల ర్యాలీకి మెటల్ స్టాక్స్ బ్రహ్మాండంగా మద్దతు పలుకుతున్నాయ్. గత మూడు సెషన్లుగా మదుపరులకు లోహపు రంగ షేర్లు సిరులు కురిపిస్తున్నాయ్. గత నెలలో కొంతమంది అంచనా వేసినట్లుగా మెటల్స్ లో షీన్ లాస్ట్ అవలేదు. ఇంకా బోలెడంత మిగిలి ఉందన్నట్లుగా భారీగా లాభపడుతున్నాయ్. 

 


స్మాల్ అండ్ మిడ్ క్యాప్ మెటల్ స్టాక్స్‌లో  వీసా స్టీల్ ఇంట్రాడేలో 3శాతం లాభపడింది. స్టీల్ ఎక్స్‌ఛేంజ్ షేర్లు 3శాతం,సెయిల్ 3.50శాతం,జేఎస్‌డబ్ల్యూ స్టీల్ 2.50శాతం,నాల్కో 2శాతం,హిందాల్కో 3శాతం లాభపడగా, నాన్ ఫెర్రస్ మెటల్స్ విభాగంలో హిందుస్తాన్ జింక్ 3.50శాతం,హింద్ కాపర్ 2.40శాతం లాభపడగా, క్యూబెక్స్ ట్యూబింగ్స్ 4.50శాతం ప్రిసిషన్ వైర్స్ ఇండియా షేర్లు 11శాతం లాభపడ్డాయ్,

 

ఒక్క కన్జ్యూమర్ డ్యూరబుల్, ఎఫ్ఎంసిజి రంగషేర్లు మినహా ప్రతి రంగంలోనూ ట్రేడర్లు బయింగ్‌కి దిగారు. గమనించండి  ఎఫ్ఎంసిజి సెక్టార్ నష్టపోవడం ఇది వరసగా రెండో సెషన్ 

 

టాప్ గెయినర్లలో కోల్ఇండియా,పవర్ గ్రిడ్, బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్ జెఎస్‌డబ్ల్యూ స్డీల్ వరసగా  4.33శాతం,2.30,2శాతం,1.42శాతం,1.16శాతం లాభపడ్డాయ్.గుర్తుంచుకోండి బజాజ్ ఫైనాన్స్ నిన్న ఇరగదీసింది. ఇవాళ ఆ ర్యాలీ ఇంకా కంటిన్యూ అవుతోంది. దీంతో మరోసారి తన 52 వారాల గరిష్టాన్ని అధిగమించింది లూజర్లలో అదానీ పోర్ట్స్  వరసగా రెండో రోజు కూడా నష్టాలపాలైంది. తర్వాత యుపిఎల్, నెస్లే,ఎస్‌బిఐ లైఫ్ ఇన్సూరెన్స్, ఎస్‌బిఐ అరశాతానికి పైగా నష్టపోయాయ్

 

ఇదీ ఉదయం పదిన్నరకు మార్కెట్ల పిక్చర్


nifty all time high 15800 15835 52626 record points level metal precision wires cubex bajaj finance

Expert's View


నేను వేసుకున్న కోటు రంగు , రానున్న రోజుల్లో మార్కెట్ల రంగు ఇదేనా ?

Trending