ఫ్లాట్ ట్రేడింగ్: ఫోకస్‌లో రిలయన్స్ 2% లాభం

2021-11-25 09:54:31 By Anveshi

img

మార్కెట్లలో వీక్‌నెస్ క్లియర్‌గా కన్పిస్తోంది. నిఫ్టీ నిన్నటి ముగింపు వద్దే తచ్చాడుతుండగా, సెన్సెక్స్ ఫ్లాట్‌గా ఓపెన్ అయింది. నిఫ్టీ బ్యాంక్ నష్టాల్లో ట్రేడవుతుండగా, ఐటీ, స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్ ఓ మాదిరి లాభాల్లో ప్రారంభం అయ్యాయ్. ఆటో, టెక్ షేర్ల పరిస్థితి కూడా డిటో, మిగిలిన రంగాల్లోనూ ఇదే రకమైన ట్రెండ్ కొనసాగుతోంది. ఐతే అటు లాభం కానీ..నష్టం కానీ ఓ మాదిరిగానే చోటు చేసుకోవడం ఓపెనింగ్ సెషన్ హైలైట్.


ఎర్లీ టాప్ గెయినర్లలో యుపిఎల్, రిలయన్స్,కోటక్ మహీంద్రా, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్ ఒకటి నుంచి
స్వల్ప లాభాల్లో ట్రేడ్ అయ్యాయ్. లూజర్లలో ఐసిఐసిఐ బ్యాంక్,ఐషర్ మోటర్స్, శ్రీసిమెంట్స్, ఎన్‌టిపిసి
ఐఓసి 2 నుంచి అరశాతం వరకూ నష్టపోయాయ్ 

 

వ్యాపారం అంతటినీ రీస్ట్రక్చరింగ్ చేయబోతున్నట్లు రిలయన్స్ లీకులు ఇవ్వడంతో ఈ కౌంటర్‌ ఇవాళ
యాక్టివ్‌గా ఉంది. ఓపెనింగ్‌లోనే ఒకటిన్నర వరకూ లాభపడింది. ఇక బ్యాంక్ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి కన్పిస్తుండటం ట్రేడర్లు గమనించాల్సి ఉంది.


RIL NIFTY KOTAK MAHINDRA

Expert's View


మంచి కంపెనీల IPO లకు ఎందుకు ఆదరణ కరువైంది ?

Trending