ఆరంభం నుంచీ దూకుడే..! 18150 పాయింట్ల దిశగా నిఫ్టీ ర్యాలీ! దుమ్ము రేపిన టాటా గ్రూప్ ..20శాతం పెరిగిన టాటా మోటర్స్

2021-10-13 11:16:56 By Anveshi

img

స్టాక్ మార్కెట్లు ఇవాళ ఓపెనింగ్ నుంచి మంచి గ్యాలప్‌మీద ఉన్నాయ్. ఇంట్రాడేలో ఇప్పటికే 18139
పాయింట్లకు ఎగసిన నిఫ్టీ మరో కొత్త మార్క్ దిశగా పరుగులు పెడుతోంది. సెన్సెక్స్ కూడా పాత రికార్డులను తుడిచిపెట్టేసి, 60676 పాయింట్ల దగ్గర కొత్త మార్క్స్ క్రియేట్ చేసింది

 

మార్కెట్ల ర్యాలీకి ఐటి, బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ ఇస్తున్నాయ్. స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్‌తో పాటు ఆటోమొబైల్ స్టాక్స్ ర్యాలీ ఓ రేంజ్‌లో సాగుతోంది. ఈ ఇండెక్స్ ఇప్పటికే 5శాతం లాభపడింది. కేపిటల్ గూడ్స్ కన్జ్యూమర్ డ్యూరబుల్స్, మెటల్స్, హెల్త్‌కేర్ షేర్లలోనూ భారీగా కొనుగోళ్లు చోటు చేసుకున్నాయ్.PSE, ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లు మాత్రమే కాస్త స్లో అయ్యాయ్. మొత్తం మీద ఏ రంగమూ నష్టాల్లో లేదు

 

టాప్ గెయినర్ల లిస్టులో  అన్నీ టాటా గ్రూప్ స్టాక్సే చోటు చేసుకున్నాయ్. టాటా మోటర్స్ 
ఇంట్రాడేలో ఏకంగా 20శాతం ర్యాలీ చేయగా, ఎం అండ్ ఎం 5శాతం, పవర్ గ్రిడ్ 4.34శాతం టాటా కన్జ్యుమర్ ప్రొడక్ట్స్ 3.60శాతం, టైటన్ 3.31శాతం లాభపడ్డాయ్. 

 

లూజర్లలో ఓఎన్‌జిసి, కోల్ఇండియా, హెచ్‌యుఎల్, నెస్లే, ఐషర్ మోటర్స్ ఒకటిన్నర నుంచి 0.35శాతం వరకూ నష్టపోయాయ్
 


TATA SENSEX NIFTY 18150

Expert's View


ఇన్వెస్టర్లకు ఎనలిస్టుల "దసరా మాములు" స్టాక్ రెకమెండేషన్స్

Trending