అద్దిరిపోయిన ఓపెనింగ్..! ఆటో స్టాక్స్ జాలీ రైడ్-మండే మంటలేనా! భారీగా పెరిగిన బాల్‌కృష్ణ ఇండస్ట్రీస్ షేరు! ఇంట్రాడేలో ఇప్పటికే రూ.70 లాభం

2021-08-02 09:33:03 By Anveshi

img

నిఫ్టీ సోమవారం 92 పాయింట్ల లాభంతో ప్రారంభమైంది. ఓపెనింగ్‌లోనే 15876 పాయింట్ల దగ్గర‌గా ఉండటంతో ట్రేడర్లలో ఉత్సాహం కన్పిస్తోంది. సెన్సెక్స్ కూడా ప్రారంభంలోనే 300 పాయింట్లు లాభపడి  52956 పాయింట్లకు ఎగసింది 

 

నిఫ్టీ బ్యాంక్, ఐటీ, స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్ లాభాల్లో ట్రేడవుతుండగా, ఆటో స్టాక్స్‌లో ర్యాలీ చోటు  చేసుకుని ఎర్లీ ట్రేడ్‌లోనే 1శాతం లాభపడింది.ఆయిల్ అండ్ గ్యాస్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ సెక్టార్ షేర్లలోనూ కొనుగోళ్ల సందడి నెలకొంది.

 

ఆటో స్టాక్స్‌లోని అమర్ రాజా బ్యాటరీస్ 3శాతం లాభపడి రూ.727.45కి ఎగయగా,అశోక్ లేలాండ్ 4శాతం  వరకూ ర్యాలీ చేసి రూ.137.35ధరకి చేరింది.బజాజ్ ఆటో ఇంట్రాడేలో 2శాతం వరకూ పెరిగి రూ.3880కి  ఎగసింది. ఆటో .యాన్సిలరీ కంపెనీ బాల్‌కృష్ణ ఇండస్ట్రీస్ ఏకంగా 52 వారాల గరిష్టానికి చేరడం విశేషం.

 

ఇంట్రాడేలో రూ.68 పెరిగి రూ.2443.60కి ఎగసిన బాల్‌కృష్ణ ఇండస్ట్రీస్ ఆ తర్వాత వెంటనే  మరో జంప్ కొట్టి రూ.2446.25కి కూడా ఎగసింది. తర్వాత రూ.2448.కి కూడా చేరింది. సో ఈ కౌంటర్‌లో ఇవాళ భారీగా యాక్షన్ నమోదు కావడం ఖాయంగా కన్పిస్తోంది

 

నిఫ్టీ టాప్ గెయినర్లలో బజాజ్ ఆటో, ఏషియన్ పెయింట్స్, కోల్ఇండియా, బజాజ్ ఫైనాన్స్ సిప్లా 1శాతం నుంచి 0.80శాతం వరకూ లాభపడ్డాయ్. లూజర్లలో యుపిఎల్, టెక్ మహీంద్రా, విప్రో, ఓఎన్‌జిసి, టాటాస్టీల్ 1.50శాతం నుంచి 0.41శాతం వరకూ నష్టపోయాయ్. 

 

ప్రస్తుతం మార్కెట్లలో మరింత జోరు పెరిగి నిఫ్టీ 15863 పాయింట్ల వద్ద, సెన్సెక్స్ 52921 పాయింట్ల వద్ద ట్రేడ్ అయ్యాయ్

 


NIFTY AUTO STOCKS BALKRISHNA INDUSTRIES RALLY 52WEEKS HIGH BUY

Expert's View


అవకాశం ఇచ్చిన tv5 నాయుడు గారికి | ఆదరిస్తున్న మీకు నా ధన్యవాదాలు

Trending