లంచ్ సెషన్‌కి ముదిరిపోయిన నష్టం..400 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ, 10లక్షలకోట్లు సొమ్ముకి మంగళం..: రూపాయ్,ఆయిల్ అమ్మకాలే కారణం..!

2022-05-19 12:33:33 By Anveshi

img

మార్కెట్లలో పతనం కొనసాగుతోంది. లంచ్ సెషన్ కి ముందే నిఫ్టీ దాదాపు 400 పాయింట్లు కోల్పోయింది
అన్ని రంగాల షేర్లలో పతనం కొనసాగుతుండగా, ఐటీ, మెటల్స్ అన్నింటికంటే ఎక్కువగా నష్టపోతున్నాయ్.ఈ రెండు సూచీలు ఇప్పటికే దాదాపు 5 శాతం నష్టాలను చవిచూసాయ్

 

ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లకు కూడా దెబ్బ బాగానే పడింది. ఎఫ్ఎంసిజి, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ కాస్త పైకి లేచే ప్రయత్నం చేస్తున్నాయ్ కానీ..సాయంత్రానికి కానీ వీటి పెర్ఫామెన్స్ పూర్తి కాదు

 

నిఫ్టీ టాప్ 5 గెయినర్లలోకి డా.రెడ్డీస్ కూడా వచ్చి చేరింది. ఈ స్టాక్ 2శాతం వరకూ లాభపడింది. ఐటీసీ 3 శాతం వరకూ లాభపడగా, ఐషర్ మోటర్స్ అలానే ఫ్లాట్‌గా సాగుతోంది. ఫ్రంట్ లైన్ లూజర్లలో ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, విప్రో జేఎస్ డబ్ల్యూ స్టీల్, హెచ్ సిఎల్ టెక్ 5 శాతానికిపైగా నష్టపోయాయ్

 

ఆర్థిక మాంద్యం చుట్టుముడుతుందనే భయం అమెరికాలో వ్యాపించగా, ఇతర దేశాల ఆర్థిక స్థితిగతులపై  కూడా అనుమానాలు తలెత్తడం మన మార్కెట్లకు శాపంగా మారింది. ఇప్పటికే దేశంలో ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయికి చేరగా ఆ అంశానికి ఈ ప్రపంచ మార్కెట్ల భయాలు అగ్నికి ఆజ్యం పోసినట్లుగా తయారు చేసాయ్

..
ఎఫ్ఐఐలు వరసగా అమ్ముకుంటూ పోవడం, చమురు ధర విపరీతంగా పెరగడం, మన రూపాయి మారకపు విలువ దారుణస్థాయికి పతనం కావడం కూడా మన మార్కెట్లను అల్లాడిస్తోంది


ఇవాళ్టి మార్కెట్లలో ట్రేడింగ్ ద్వారా ఇన్వెస్టర్ల సంపద కనీసం 10లక్షల కోట్లు ఆవిరి అయి ఉంటుందని అంచనా. అసలు లెక్కలు సాయంత్రానికి కానీ తేలవు