అదిరిపోయిన ముగింపు..! 15900 పాయింట్లకు దగ్గరగా నిఫ్టీ క్లోజ్! టాప్‌గెయినర్‌గా శ్రీసిమెంట్

2021-08-02 16:14:52 By Anveshi

img

స్టాక్ మార్కెట్లు ఆగస్ట్ నెలని అద్భుతంగా ఆరంభించాయ్. ఫ్యూచర్స్‌తో సంబంధం లేకుండా, నిఫ్టీ 122 పాయింట్లు ఎగసి 15885 పాయింట్లు అంటే 15900 పాయింట్లకు దగ్గరగా ముగిసింది. సెన్సెక్స్ 364 పాయింట్లు పెరిగి 52950 పాయింట్ల వద్ద ముగిసింది

 


నిఫ్టీ బ్యాంక్, ఐటీ, మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ భారీగా లాభపడ్డాయ్. కన్జ్యూమర్ డ్యూరబుల్స్ ఐటి, ఆయిల్ అండ్ గ్యాస్, రియాల్టీ ఇండెసిస్ 1 నుంచి మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఒక్కోశాతం  పెరిగింది. ఏతా వాతా చూస్తే ఒక్క మెటల్ స్టాక్స్ మినహా, ప్రతి రంగంలో సోమవారం కొనుగోళ్లు  అద్భుతః అన్పించాయ్. 

 

నిఫ్టీ గెయినర్లలో శ్రీ సిమెంట్స్ 3.64శాతం లాభపడగా, టైటన్, ఐషర్ మోటర్స్, బిపిసిఎల్,  గ్రాసిం, 3 నుంచి 2.60శాతం వరకూ లాభపడ్డాయ్.లూజర్లలో యూపిఎల్, టాటా స్టీల్, బజాజ్ ఫిన్‌సర్వ్, బజాజ్ ఫైనాన్స్, ఎన్‌టిపిసి 2.16శాతం నుంచి 0.44శాతం వరకూ నష్టపోగా, మొత్తం మీద ఇండెక్స్‌లలో నిఫ్టీ గత రెస్టినెన్స్‌ని అధిగమించే ప్రయత్నం చేసిందనే చెప్పాలి. 

 

అలా బుల్స్ రైడ్ కొనసాగేందుకు అవసరమైన పునాదిని ఇవాళ వేశారని చెప్పాలి. ఇకపై 15950-15800 పాయింట్ల మధ్యలో రేంజ్ బౌండ్ ట్రేడ్‌ ఈ వారం వరకూ ఎక్స్‌పెక్ట్ చేయవచ్చనే అంచనాలు నెలకొన్నాయ్.టెక్నికల్‌గా కూడా ఇదే రకమైన ధోరణి కన్పిస్తోంది

 


NIFTY GAINERS BULLS RIDE 15900 15850 CLOSING REPORT CHART VIEW TECHNICAL

Expert's View


అవకాశం ఇచ్చిన tv5 నాయుడు గారికి | ఆదరిస్తున్న మీకు నా ధన్యవాదాలు

Trending