కేక పెట్టిస్తోన్న ట్రైడెంట్, జమ్నా ఆటో ! 52 వీక్స్ హై టచ్ చేసి 4-10% జంప్ చేసిన 7 స్టాక్స్

2022-01-14 13:45:53 By Anveshi

img

మధ్యాహ్నం లంచ్ సెషన్‌కి మార్కెట్లు ఆరంభపు నష్టాలను దాదాపు పూడ్చుకున్నాయ్. నిఫ్టీ తిరిగి 18200 పాయింట్లపైకి చేరింది. ఐతే ఇంకా 40 పాయింట్ల నష్టంలోనే ఉంది. అటు సెన్సెక్స్ కూడా 61100 పాయింట్లపైనే ట్రేడవుతోంది

 

ఈ దశలో స్మాల్ క్యాప్ ఇండెక్స్ అరశాతం లాభపడగా, ఐటీ స్టాక్స్  లాభాల్లో ట్రేడవుతున్నాయ్.

 

ఇక మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్‌లో ర్యాలీ ఓ రేంజ్ సాగుతుండగా, కొన్ని స్టాక్స్ వరసగా 52 వారాల గరిష్ట ధరలను తాకుతున్నాయ్.

 

వాటిలో జమ్నా ఆటో, ట్రైడెంట్ వరసగా రెండో రోజు కూడా 52 వీక్స్ హై టచ్ చేశాయ్. తర్వాత హెవీ ప్రైస్డ్ స్క్రిప్ లక్ష్మీ మెషీన్ వర్క్స్ ఇండియా సిమెంట్స్, ఆఫ్‌ల్ ఇండియా, తాన్లా సొల్యూషన్స్, వెల‌స్పన్ కార్పొరేషన్ 5 నుంచి 3శాతం వరకూ  పెరిగి యాభై రెండు వారాల గరిష్ట ధరలను సవరించాయ్

 


52 weeks hihg