NBFCలకు నో థర్డ్‌వేవ్ ఫియర్..! స్టాక్స్ పరిస్థితేంటి..!

2022-01-15 16:16:11 By Anveshi

img

దేశంలో కరోనా రెండు దశలు బ్యాంకుల కార్యకలాపాలతో పాటు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థల వ్యాపారంపై తీవ్రంగానే ప్రభావం పడింది. ఐతే కరోనా థర్డ్ వేవ్‌ మాత్రం ఎన్‌బిఎఫ్‌సిల వ్యాపారంపై మాత్రం పెద్దగా ప్రభావం చూపలేదని విశ్లేషకులు పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికైతే వాటి కలెక్షన్లపై ఎలాంటి ఎఫెక్ట్ లేదని రేటింగ్ ఏజెన్సీ ఇండియా రేటింగ్స్ కూడా ఓ నివేదిక ఇచ్చింది

 

మరోవైపు బ్యాడ్ లోన్లు కూడా క్రమంగా తగ్గుతున్నాయని ఇండియా రేటింగ్స్ చెప్తోంది

 

కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్‌లో వసూళ్లు 60-70శాతం మొదటి క్వార్టర్‌లో పతనం కాగా, ఇప్పుడు ప్రీకోవిడ్ లెవల్స్‌కి చేరినట్లు తెలుస్తోంది. మైక్రోఫైనాన్స్ లోన్ల విభాగంలో రెండో దశ కరోనాలో 20-25శాతం వసూళ్లు తగ్గాయి. ఐతే  ఇప్పుడా స్థితి లేదు థర్డ్‌వేవ్ విషయంలో  ఇప్పుడే పరిస్థితిని అంచనా వేయడం సరికాకపోయినా, ఇప్పటిదాకా మాత్రం వసూళ్లలో ఎలాంటి ఢోకాలేదని ఇండియా రేటింగ్స్ చెప్తోంది

ఓమిక్రాన్ వేరియంట్ స్ప్రెడ్ అవుతున్న తీరు ఆందోళన కరంగా ఉన్నా..ఇప్పటికైతే హాస్పటలైజేషన్ అంశంలో సెకండ్ వేవ్ అంత తీవ్రత లేదు. దీనికి తోడు వైద్యవిభాగాలు కూడా ఈ వేవ్‌ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాయి. అంతేకాదు నాన్బ్యాంకింగ్  ఫైనాన్షియల్ సంస్థలు కూడా బ్యాలెన్స్ షీట్లను స్ట్రాంగ్‌గా మెయిన్ టైన్ చేసే ప్రణాళికల్లో ఉన్నాయ్. ఒడిదుడుకులను ఎదుర్కొనేందుకు బఫర్ స్టాక్ కూడా అట్టిపెట్టుకున్నాయ్. 

 

దీంతో ఈ రంగంలోని ముత్తూట్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌డిఎఫ్‌సి, పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్,ఆదిత్య బిర్లా కేపిటల్,శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్, ఎల్ అండ్ టి ఫైనాన్స్, చోళమండలం ఇన్వెస్ట్‌మెంట్,సుందరం ఫైనాన్స్ వంటి స్టాక్స్‌కి రీరేటింగ్ తప్పదని అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు.
 


NBFC