మనం గతవారం 40కోట్లకిపైగా ఖర్చుతో ప్రీషియస్ విల్లా కొనుగోలు చేసిన రెడ్డిగారి స్టోరీ చూశాం కదా..ఇప్పుడా వంతు
నందమూరి నటసింహం వంతు వచ్చింది. ఆ ఖరీదంత కాదు కానీ, రూ.15 కోట్లతో హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఏరియాలోనే
ఓ ఇల్లు కొన్నారు నందమూరి బాలకృష్ణ. దీంతో సినిమారంగంలో తన కలెక్షన్లతో బాక్సాఫీస్ షేక్ చేసే బాలయ్య రియల్ఎస్టేట్
రంగంలోనూ తన కొనుగోలుతో రికార్డ్ స్థాయి ధర పలకించారని చెప్పాలి
ఫిబ్రవరి 11,2021న అంటే నేటికి పద్నాలుగు రోజుల క్రితమే ఈ డీల్ పూర్తి చేసారు బాలయ్య. నడింపల్లి సత్యశ్రావణి నుంచి
ఆయన ఈ ఇల్లు కొనుగోలు చేసినట్లు జాప్కీ డాట్ కామ్( Zapkey.com) వెబ్సైట్ చెప్తోంది. గ్రౌండ్ ఫ్లోర్ కాకుండా మరో రెండు అంతస్థులు కలిగిన ఈ భవంతి మొత్తం 9395 చదరపు అడుగుల్లో బిల్టప్ ఏరియా ఉంది. ఈ భవంతిని బాలయ్యబాబు దంపతులు ఇద్దరి పేరిట జాయింట్‌గా కొనుగోలు చేసినట్లు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్‌ని బట్టి తెలుస్తోంది.
(చదవండి రూ.41కోట్ల విల్లా ఖరీదు చేసిన రెడ్డిగారు..ఎక్కడో తెలుసా..?)
మొత్తం స్టాంప్ డ్యూటీ రూ.82.5లక్షలు, రిజిస్ట్రేషన్ ఫీజు రూ.7.5లక్షలు ఖర్చు అవగా, బాలయ్య అభిమానులు ఈ న్యూస్ బ్రేక్ అవగానే గూగుల్‌లో ఇదెక్కడ ఉందాని వెతకడం ప్రారంభమైంది. వందకిపైగా సినిమాలు చేసిన బాలకృష్ణ వయసు ఎప్పటికప్పుడు తగ్గిందా అన్పించేలా హుషారుగా పని చేస్తుంటారు. ప్రస్తుతం బోయపాటి శ్రీనివాస్ డైరక్షన్లో ఓ సినిమాలో నటిస్తున్నారాయన.