డిసెంబర్ నాటికి సెన్సెక్స్@61000 ! ఇండియన్ ఈక్విటీ మార్కెట్లపై మోర్గాన్ స్టాన్లే అంచనా ! ఏ థీమ్ అయితే బెస్ట్ అని చెప్పిందో తెలుసా..?

2021-05-18 15:19:22 By Anveshi

img


మార్కెట్ల టార్గెట్ వేరే !
డిసెంబర్ ‌నాటికి 61వేల పాయింట్లకు చేరుతుందంటూ అంచనా
ఫండమెంటల్స్, ఆర్థిక ఫలితాలే దారి చూపిస్తాయంటున్న మోర్గాన్ స్టాన్లే 

 

సెన్సెక్స్ ఇవాళ్టి మార్కెట్లలో 50వేల పాయింట్లు దాటడంతో ఇక మహా అయితే మరో  వెయ్యి పాయింట్లు పెరుగుతుందేమో, లేదంటే 2వేల పాయింట్లు యాడ్ అవుతుంది. ఆ తర్వాత తిరిగి కన్సాలిడేట్ అవుతుందని చాలా మంది అంచనా వేస్తున్నారు. ఎందుకంటే హయ్యర్ లెవల్స్‌ దగ్గరకు రావడం, లాభాల స్వీకరణతో తిరిగి ఓ 2వేల పాయింట్లు కిందికి జారడం గత కొద్దినెలలుగా చూస్తున్న విషయమే. ఐతే  స్టాక్ మార్కెట్లలో జోరు ఇప్పట్లో తగ్గదని, డిసెంబర్ నాటికి సెన్సెక్స్ 61వేల పాయింట్ల మార్క్ అందుకుంటుందంటూ బ్రోకరేజ్  సంస్థ మోర్గాన్ స్టాన్లే అంచనా వేసింది. ఇప్పుడు కన్పిస్తున్న స్పీడ్ కొద్ది రోజుల్లో తగ్గినా తగ్గవచ్చంటూ కొందరు సందేహాలు  వ్యక్తం చేస్తోన్న తరుణంలో మోర్గాన్ స్టాన్లే అంచనాలు ప్రాథాన్యత సంతరించుకున్నాయ్

 

ఈ ఏడాది చివరినాటికి సెన్సెక్స్ 55వేల పాయింట్ల మార్క్ చేరుకుంటుందంటూ మోర్గాన్ స్టాన్లే గతంలోనే అంచనాలు  వెలువరించింది. ఐతే తాజాగా ఆర్థిక ఫలితాలు వరసగా రికార్డులు క్రియేట్ చేస్తుండటంతో దాన్ని ఇంకాస్త సవరించినట్లు  కన్పిస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే 61వేలకు కూడా సెన్సెక్స్ ఎగయనుందని తాజాగా చెప్తోంది. అంటే ప్రస్తుతం ఉన్న స్థాయి నుంచి మరో 20శాతం అప్‌ట్రెండ్ సెన్సెక్స్ నుంచి ఆశించవచ్చన్నమాట

 

ఆర్థిక ఫలితాల వృద్ధిలో వేగం, సరైన వేల్యేషన్స్, అండర్ పెర్ఫామ్డ్ స్టాక్స్ తొందర్లో ఫెయిర్ వేల్యూకి రానుండటంతో పాటు పటిష్టమైన పాలసీ విధానాలు భారత స్టాక్ మార్కెట్లు అభివృద్ధి చెందుతోన్న మార్కెట్లు అన్నింటికంటే ఎక్కువగా లాబాలను  చవి చూడటానికి కారణాలుగా మోర్గాన్ స్టాన్లే అంచనా వేసింది

 

ఇదే సందర్భంలో ఇన్వెస్టర్లు మార్కెట్ల పరిస్థితులకు అనుగుణంగా  లార్జ్‌క్యాప్ కంటే మిడ్‌క్యాప్స్, స్మాల్‌క్యాప్ నుంచి లార్జ్‌క్యాప్‌కి షిఫ్ట్ అవుతూ ఉండటం మంచిదని సూచించింది. అలానే కన్జ్యూమర్ డిస్‌రిషేనరీస్, ఇండస్ట్రియల్, ఫైనాన్షియల్, యుటిలిటీ బేస్డ్ థీమ్‌పై ఓ కన్నేసి ఉంచాలని చెప్తోంది. ఐటీ, ఫార్మా, టెలికాం, ఎనర్జీ స్టాక్స్‌లో సెలక్టివ్‌గా ఇన్వెస్ట్‌మెంట్  చేయాలని చెప్పింది. 2021లో కన్జ్యూమర్  డిస్‌రిషేనరీస్లో రాబోయే కొద్ది నెలల్లో మంచి వృద్ధి నమోదు అవుతుందని అంచనా వేసింది. పెరగనున్న  ఆదాయాలతో రాబోయే రోజుల్లో వీటి ప్రాథమిక స్థితిగతులు అద్భుతంగా ఉంటాయంటూ అభిప్రాయపడింది

 

ఇండస్ట్రియల్ సెక్టార్‌లో ప్రభుత్వం కేపెక్స్( మూలధన వ్యయం) భారీగా ఖర్చు పెట్టనుండటం, ప్రవేట్ రంగంలో కేపెక్స్‌తో పాటు చౌక ధరల్లో మంచి స్టాక్స్ దొరుకుతున్నాయని సూచించింది. ఫైనాన్షియల్ సర్వీస్ రంగంలో వడ్డీరేట్లు ఇక తగ్గింపు  సాధ్యపడకపోవచ్చని, ఇది రేట్ సెన్సిటివ్ స్టాక్స్‌కి ప్రయోజనం కలిగిస్తుందని, ఆ దిశగా స్టాక్స్ కొనుగోళ్లు చేస్తే ప్రయోజనమని
మోర్గాన్ స్టాన్లే సూచించింది. 


sensex 61000 mark bse nifty morgan stanley december 2021 telugu profit trade

Expert's View


నేను వేసుకున్న కోటు రంగు , రానున్న రోజుల్లో మార్కెట్ల రంగు ఇదేనా ?

Trending