బ్లాక్ మనీ అడ్డాలు ఈ దేశాలు.. దాచుకుంటే ఫుల్ సేఫ్

2021-06-18 09:18:11 By Y Kalyani

img

బ్లాక్ మనీ అడ్డాలు ఈ దేశాలు.. దాచుకుంటే ఫుల్ సేఫ్

కరోనా కారణంగా దేశఆర్థక వ్యవస్థ ఛిన్నాభిన్నం అవుతోంది. పేదలు దుస్థితి మరింత దిగజారుతోంది. కానీ పెద్దల సంపద అంతకంతకూ పెరుగుతోంది. చివరకు విదేశాల్లో దాచుకునేంతగా వారి ఆదాయం పెరుగుతోంది. ఇందులో బ్లాక్ ఉండొచ్చు.. వైట్ ఉండొచ్చు. ఓవరాల్ గా విదేశీ బ్యాంకులకు లక్షల కోట్ల సంపద చేరుతుందని తాజా నివేదిక చెబుతోంది. ఇటీవల బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూపు ఓ సర్వే చేసింది. ఇందులో భాగంగా స్విట్జర్లాండ్ లో భారీగా డబ్బు దాచుకున్నట్టు గుర్తించారు. 2020లోనే విదేశాల్లో 2.4 లక్షల కోట్లు జమ అయిందట. 

2020లో ఏ దేశంలో ఎంత ఉందంటే..
స్విట్జర్లాండ్ లో 2.4లక్షల కోట్లు
హాంకాంగ్ 2.1 లక్షల కోట్లు
సింగపూర్ 1.2 లక్షల కోట్లు
అమెరికా 90వేల కోట్లు
ఐలాండ్స్ 50వేల కోట్లు
యూఏఈ 50వేల కోట్లు
లగ్జంబర్గ్ 40వేల కోట్లు
యూకే 30వేల కోట్లు

బ్లాక్ మనీ ఫుల్.. 
మనదేశంలో బ్లాక్ మనీ విదేశాలకు భారీగా చేరుతుందట.. తాజాగా వచ్చిన నివేదిక ప్రకారం గత ఏడాది 20 వేల కోట్లు చేరినట్టు అంచనా. అంటే పాలకుల మాటలు నీటిమీద రాతలు... దొంగడబ్బు తెస్తాం.. పంచుతాం... డెవలప్ చేస్తాం అంటూ హామీలు ఇవ్వడమే కానీ ప్రయత్నాలు చేసింది లేదు. గతంలో కమిటీల వేశారు... కమిషన్లు వేశారు.. ఉపయోగం లేదు. అంతేకాదు...నోట్ల రద్దుతో మొత్తం మారుతుందన్నారు. దొంగనోట్ల రావన్నారు.. బ్లాక్ మనీ అంతమే అన్నారు. తగ్గకపోగా పెరిగిందన్న అభిప్రాయం బలపడుతోంది. ఇటీవల ఓ తెలుగు ఛానల్ కు RBI మాజీ గవర్నర్ కూడా నోట్ల రద్దు ఫెయిల్యూర్ ను చెప్పకనే చెప్పారు. అంటే మాటలకు చేతలకు పొంతన లేదు. బ్లాక్ మనీ రప్పించడంలో విఫలం.. ఇంకా పెరుగుతున్నా అడ్డుకోవడంలో వైఫల్యం కనిపిస్తోంది. 


block money money swiss banks