ఇక‌పై ఫుల్ డిఫెన్స్ స్టాక్స్ ఈ షేర్లు ! డెవలప్‌మెంట్స్ మిస్ కాకండి

2021-02-22 12:37:42 By Anveshi

img

ప్రధానమంత్రి నరంద్రమోదీ ఆత్మ నిర్భర్ భారత్ డిఫెన్స్ రంగంలోని కంపెనీలకు సిరులు కురిపించనుందా అంటే..ఔననే అన్పిస్తోంది
లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ తేజస్‌ విషయమే చూసుకుంటే ఈ యుద్ధవిమానం తయారీ కోసం రూ.48వేల కోట్లను ఇన్వెస్ట్ చేసేందుకు కేబినెట్ అప్రూవ్ చేసింది. ఇది పాత విషయమే అయినా ప్రధానమంత్రి మరోసారి ఆ విషయాన్ని నొక్కి చెప్పడం స్టాక్ మార్కెట్లలో ఆయా షేర్లకు స్పీడ్ తెస్తోంది.తొందర్లోనే వంద రకాల ఉత్పత్తులు, పరికరాల తయారీ కోసం ఓ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసినట్లు చెప్పారాయన. తేజస్ తరహా యుద్ధవిమానాలకు ఇతర దేశాల నుంచి కూడా ఆర్డర్లు వస్తున్నాయని ప్రధాని చెప్పారు

ఇవాళ్టి వెబినార్‌లో మాట్లాడిన ప్రధానమంత్రి  సొంతంగా ఆయుధాలు తయారు చేసుకునే సత్తా, చరిత్ర మన దేశానికి ఉందని..రెండో ప్రపంచయుద్ధ సమయంలోనూ భారత్ ఆయుధాలను, మందుగుండు సామాగ్రిని సరఫరా చేసినట్లు ప్రధానమంత్రి ఈ సందర్భంగా గుర్తు చేసారు. ఐతే స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రతి చిన్న రక్షణ పరికరం కోసం
చిన్న చిన్న దేశాలపై ఆధారపడాల్సి వచ్చిందని మోదీ చెప్తూ..ఓ వంద ఐటెమ్స్‌ని దిగుమతి ఆపేసినట్లు..ఈ వంద రకాల ఉత్పత్తులు ఇక భారత్‌లోనే తయారవుతాయని. అందుకోసం పెట్టుబడికి ఢోకా లేకుండా ప్రవేట్ కంపెనీలను కూడా ఆహ్వానించినట్లు చెప్పారు.  ఈ క్రమంలోనే తేజస్ ప్రస్తావన చేశారాయన. ఐతే ఈ తేజస్‌ని పూర్తిగా హిందుస్తాన్ ఏరోనాటికల్స్ లిమిటెడ్ సంస్థే తయారు చేస్తుంది. రెండు రకాలుగా ఈ ప్రకటన సంస్థకి మేలు చేస్తుంది. ఒకటి పిఎల్ఐ స్కీమ్, అంటే ప్రొడక్ట్  లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ఒకటి తేజస్‌తో పాటు ఇతర ఉత్పత్తుల తయారీలో
లాభాన్ని పెంచనుండగా..తేజస్‌ని ఇక్కడే తయారు చేయడం ద్వారా ఆపరేషనల్ రెవెన్యూ భారీగా పెరుగుతుంది. ప్రధానమంత్రి మాటల్లో మరో విషయం కూడా స్పష్టంగా అర్ధమవుతోంది, రక్షణరంగంలో ప్రవేట్ కంపెనీలను ఆహ్వానించడం అంటే, కేవలం వాటికి సొంతంగా ప్రాజెక్టులు అప్పగించడమే కాదు, ఇప్పుడున్న ప్రభుత్వ రంగ కంపెనీల వాటాలను కూడా విక్రయించే అవకాశాన్ని కొట్టి పారేయలేం. మేజర్ వాటా ప్రభుత్వానికే ఉంచుతూ, 5శాతం, 10శాతం వాటాలు విక్రయించినా ఈ సంస్థల ఉత్పత్తి, లాభంతో పాటు స్టాక్ మార్కెట్లలో వాటి వేల్యూ
భారీగా అన్‌లాక్ కావచ్చు

ముందుగా తేజస్‌కి సంబంధించిన మేజర్ మేకర్, హెచ్ఏఎల్‌ను చూద్దాం, గత త్రైమాసికంలో హెచ్ఏఎల్ సంస్థ రెవెన్యూ..ఇందులో ఉద్యోగుల జీతాలు, వడ్డీ ఇతరత్రా అంశాలకే 1శాతానికంటే ఎక్కువగా ఖర్చు పెడుతోంది హెచ్ఎఎల్. గత త్రైమాసికంలో రూ.5516కోట్ల ఆదాయం ఆర్జించగా..ఖర్చులే రూ.4395.80కోట్లుగా తేలింది. ఖర్చుల వ్యయం 8.70శాతం పెరగగా..ఆదాయ వృద్ధి దాదాపు ఒకటిన్నరశాతం. నికరలాభం రూ.853కోట్లు కాగా, నెట్ ప్రాఫిట్ మార్జిన్ 15.47కోట్లుగా నమోదైంది.

సంస్థలో వాటాల విషయం చూస్తే..హెచ్ఏఎల్‌లో ప్రమోటర్ హోల్డింగ్ 75.15శాతం, ఎఫ్ఐఐలు 0.30శాతం, డిఐఐలు 19.70శాతం, మ్యూచువల్ ఫండ్ 3.74శాతం, అదర్స్ 4.85శాతం అంటే బైట ట్రేడవుతున్న వాటాలు 5శాతం లోపే. జనరల్ రిటైల్ వాటాలు ఇంత తక్కువ సంఖ్యలో( కోటిన్నర షేర్లు) మార్కెట్లో లావాదేవీలు జరుగుతున్నాయి కాబట్టే..ఎక్కువమంది ఈ స్టాక్‌పై ఇప్పుడు ఫోకస్ పెట్టాల్సి రావచ్చు. ప్రస్తుతం హిందుస్తాన్ ఏరోనాటికల్స్ లిమిటెడ్ షేర్లు అరశాతం లాభపడి రూ.1067.10 వద్ద ట్రేడ్ అయ్యాయ్.

ఇవే కాదు..భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (రూ.39.80), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(రూ.132.15) షేర్లు కూడా రాబోయే రోజుల్లో మరింత లాభాలను పంచడం ఖాయంగా అర్ధమవుతోంది. అంతే కాదు డిఫెన్స్ రంగంలో అక్విజిషన్లు, టేకోవర్లు, వాటాల విక్రయాన్ని తొందర్లోనే మనం చూసే అవకాశాలు పుష్కలంగా కన్పిస్తున్నాయ్.

Expert's View


MTAR Technologies కాసుల వర్షం కురిపిస్తుందా?

Trending