మార్కెట్లను పలకరించేందుకు ఫస్ట్ ఫార్మా చెయిన్ రెడీ..! IPOకి రాబోతోన్న మెడ్‌ ప్లస్సేంటి.. మైనస్‌లేంటి?ఎక్స్‌క్లూజివ్ స్టోరీ: ఫుల్ డీటైల్స్ గ్యారంటీ

2021-09-25 17:15:07 By Anveshi

img

దేశంలోనే రెండో పెద్ద లార్జెస్ట్ ఫార్మా చెయిన్
ఫార్మా రిటైల్ రంగంలో 15ఏళ్ల అనుభవం
రూ.1600 కోట్ల  ఇష్యూతో పబ్లిక్ మార్కెట్‌లోకి ఎంట్రీ ట్రయల్స్
విస్తరణ వ్యూహంలో వెనుకబాటు
పబ్లిసిటీని అస్సలు పట్టించుకోని వైనం

 

మన దేశంలోనే రెండో అతి పెద్ద మెడికల్ రిటైల్ చెయిన్ కంపెనీ, మెడ్‌ప్లస్, మన తెలుగు పట్టణాల్లో మెడికల్ షాపు అనగానే గుర్తొచ్చే పేరుగా కూడా ఎదిగింది. ఐనా సరే సరే సరైన వేల్యేషన్ తెచ్చుకోవడానికి  నానా తంటాలూ పడుతోంది. పైగా ఇదే రంగంలోని ఇతర కంపెనీలు మంచి వేల్యేషన్స్ తెచ్చుకుంటుండగా, ఇది మాత్రం అవస్థలు పడుతోంది. మామూలుగా అయితే మార్కెట్లలో ఇలాంటి కంపెనీలకు మంచి ప్రీమియం దక్కుతుంది కానీ, మెడ్‌ప్లస్ విషయంలో ఇది జరగలేదు

 

ఈ తరుణంలో మెడ్‌ప్లస్ ఐపిఓ ప్రారంభం కానుంది. రూ.1600కోట్ల నిధుల సమీకరణ లక్ష్యంతో మార్కెట్లను పలకరించబోతోంది. అలా లిస్టింగ్ కి వచ్చే ఫస్ట్ ఫార్మాసీ చెయిన్ అవుతుంది. ఈ 1600కోట్లలో 600 కోట్ల ఫ్రెష్ ఇష్యూ, 1000కోట్ల ఆఫర్ ఫర్ సేల్ ద్వారా ప్రమోటర్లు ఎగ్జిట్ అయ్యేందుకు కేటాయించారు

 

జొమేటో ఐపిఓ హిట్ అయిన తర్వాత వస్తోన్న ఐపిఓ, అలానే ఫస్ట్ ఫార్మా రిటైల్ చెయిన్, అంతేకాదు ఇది పూర్తైన తర్వాత ఏపీఐ హోల్టింగ్స్( ఫార్మాఈజీ), వెల్‌నెస్ ఫరెవర్ వంటి సంస్థలు కూడా రాబోతున్నాయ్. 

 

ఐపీఓకి ముందు మెడ్‌ప్లస్ ప్రయత్నాలు


రెండేళ్ల క్రితమే ఫార్మాఈజీ కంపెనీ మెడ్‌ప్లస్‌ను కొనుగోలుకు సిద్ధపడింది. కానీ టర్మ్స్ కుదరలేదు .ఆన్‌లైన్ ఫార్మా కంపెనీల్లో భారీగా డిస్కౌంట్లు కట్టబెట్టే మెడ్‌ప్లస్, అటు ఆపరేటింగ్ రెవెన్యూ విషయంలో..నంబర్ ఆఫ్ స్టోర్ల విషయంలో రెండో పెద్ద కంపెనీ. 2019లో గంగడి మధుకర్( మెడ్‌ప్లస్ ప్రమోటర్, ఫౌండర్) ఫార్మాఈజీకి కంపెనీని 3వేల కోట్లకి విక్రయిద్దామని ప్రపోజల్ పెట్టగా, అది కాస్తా బెడిసికొట్టింది. ఈ ఏడాదిలో దాదాపుగా అంతే మొత్తంలో నిధులు సేకరించగలిగింది. ఇదే ఫార్మ్ఈజీ కంపెనీ చాలా ఈజీగా ఏపిఐ హోల్డింగ్స్ నుంచి 650 మిలియన్ డాలర్లు రైజ్ చేయగలిగింది. దీని వేల్యూ ప్రస్తుతం 4 బిలియన్ డాలర్లు. 

 

కానీ మెడ్‌ప్లస్ మాత్రం ప్రేమ్‌జీ ఇన్వెస్ట్, PE వార్‌బర్గ్ పింకస్ నుంచి 400 మిలియన్ డాలర్లు మాత్రమే సేకరించింది. ఇది జరిగి కూడా ఏడు నెలలు దాటుతోంది

 

ప్రస్తుతానికి మార్కెట్‌లో అపోలో ఫార్మసీ,మెడ్‌ప్లస్ మధ్య పోటీ విపరీతంగా ఉంది. అలానే ఈ ఫార్మసీలని చూస్తే, నెట్‌మెడ్స్, ఫార్మ్ఈజీ కంపెనీలుున్నాయ్. గతంలోలాగా, కేవలం భారీ డిస్కౌంట్లు మాత్రమే ఈ మార్కెట్లో పని చేయవు. ఆన్‌లైన్, ఆఫ్ లైన్ కౌంటర్ బిజినెస్‌లు భారీగా జరగాలి.

 

అందుకే మెడ్‌ప్లస్ వీలైనంత అగ్రెసివ్‌గా స్టోర్లు ఓపెన్ చేస్తామని ప్రకటించింది. సంవత్సరంలో 600-800, ఆ తర్వాతి సంవత్సరంలో 1000 స్టోర్లు ప్రారంభిస్తామని అంటోంది. ఐతే పేరుకే సెకండ్ బిగ్గెస్ట్ ఫార్మా చెయిన్ కంపెనీ కానీ మెడ్‌ప్లస్ వ్యాపారం అంతా ఆంధ్ర, తెలంగాణ,కర్నాటక, తమిళనాడు నుంచే వస్తోంది. మహారాష్ట్ర,వెస్ట్ బెంగాల్, ఒడిశాలో నామమాత్రంగా ఉనికి చాటుతుంది. ఇదే కంపెనీ వేల్యేషన్ పెరగకపోవడానికి మరో కారణం

 

ఒడిదుడుకుల ఫలితాలు
గత రెండేళ్లుగా కంపెనీ నంబర్లు అప్ అండ్ డౌన్ అవుతున్నాయ్. 2020తో  ముగిసిన ఆర్థిక సంవత్సరంలో కంపెనీ కన్సాలిడేటెడ్ రెవెన్యూ 26శాతం పెరిగి రూ.2781కోట్లకు చేరగా, లాభం మాత్రం 85శాతం పతనమై 2కోట్ల రూపాయలకు పరిమితం అయింది. తర్వాత సంవత్సరం రెవెన్యూ 7శాతం పెరిగి రూ.3069కోట్లకి చేరగా, లాభం మాత్రం ఏకంగా 3400శాతం పెరిగి రూ.63కోట్లకి ఎగసింది

 

ఈ ఒడిదుడుకులకు కోవిడ్‌ను కంపెనీ సాకుగా చూపడం కాస్త విచిత్రంగా ఉంది. ఎందుకంటే, ఏ ఫార్మా కంపెనీ, మెడికల్ వ్యాపారానికైనా 2021 బంపర్ ఇయర్‌గా మారింది

 

ఇదే 2021 ఆర్థిక సంవత్సరం అపోలో ఫార్మసీ, మెడ్‌ప్లస్, వెల్‌నెస్ ఫరెవర్ నంబర్లు చూద్దాం


DRHP హైలైట్స్

2017లో  గోల్డ్‌మేన్ శాక్స్ , ఎడెల్వైజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ నుంచి గంగడి ఇన్వెస్ట్‌మెంట్స్ రూ.750కోట్లు అప్పు తీసుకుంది. ప్రమోటర్ స్టేక్ 90శాతం దాటడంతో పాటు, అప్పు తీర్చడం కోసం ఫార్మాఈజీకి విక్రయప్రతిపాదన తెచ్చిందంటారు.తర్వాత తమ ఈక్విటీని 22శాతం ప్రేమ్‌జీ ఇన్వెస్ట్‌మెంట్‌, 25శాతం వార్‌బర్గ్ పింకస్‌కు విక్రయించింది. ఆ తర్వాత లోన్ ఫర్రో, అజైల్‌మెడ్‌కి కూడా వాటా విక్రయించారు. అలా 2018 తర్వాత 96శాతం నుంచి ప్రమోటర్ వాటా 45శాతానికి  దిగి వచ్చింది. అలానే అప్పులు మొత్తం 617కోట్లకి పెరిగాయి. ఇవన్నీ కూడా డిఆర్‌హెచ్‌పి ద్వారా సంస్థే స్వయంగా ప్రకటించినవి


ఓసారి గంగడి ఇన్వెస్ట్‌మెంట్స్( ప్రమోటర్ మధుకర్ ) మెడ్‌ప్లస్ స్టోర్ల సంఖ్య 2011 నాటికి 5వేలు స్థాపిస్తామని ప్రకటించింది 2015లో ఈ సంఖ్యని పదివేలకి పెంచి, కాలాన్ని 2019కి పొడిగించింది. ఇప్పటికీ ఈ సంఖ్య ఎంతో తెలుసా, జస్ట్ 2100 ఇదే అపోలో ఫార్మసీ స్టోర్ల సంఖ్య దీనికి రెట్టింపు ఉంది.

 

పైగా ప్రచారం విషయంలోనూ మెడ్‌ప్లస్ చాలా చాలా లో ప్రొపైల్ మెయిన్ టైన్ చే స్తుంది. సంస్థ ప్రమోటర్ మధుకరే స్వయంగా గత ఐదేళ్లలో తాము రూ.10-12కోట్లు మాత్రమే ఖర్చు పెట్టినట్లు చెప్పారు. ఇది ఓ వారం లేదంటే పదిహేనురోజుల్లో ఇతరులు పెట్టే పబ్లసిటీ ఖర్చుగా ఆయనే అంగీకరిస్తారు. 

 

ఈ మధ్యనే ఆన్‌లైన్ ప్రకటనలు చూసి ఉంటారు. రెండుగంటల్లో డెలివరీ అంటూ మెడ్‌ప్లస్ యాడ్స్ చూసి ఉంటారు. ఇది హైదరాబాద్ లాంటి సిటీల్లో ఓకే కానీ, అన్ని చోట్లా కుదరదు. అందుకే డిఆర్‌హెచ్‌పిలో చెన్నై, ముంబైలోనూ ఈ డెలివరీని అందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పుకొచ్చింది సంస్థ

ఇక డిస్కౌంట్ల యుగంలోనూ మెడ్‌ప్లస్‌కి భారీగానే పోటీ ఉంది. ఆ లిస్టు కింది ఫోటోలో చూడండి

 

సో..ఇంత పోటీ, అవాంతరాలు, అనివార్యతల మధ్య మెడ్‌ప్లస్ సంస్థ ఐపిఓకి రాబోతోంది. ఇన్వెస్టర్లు ఎలా ఆదరిస్తారన్నది కొద్ది రోజుల్లో తేలిపోనుంది

 


MEDPLUS IPO DRHP ISSUE LISITNG MADHUKAR GONGADI

Expert's View


ఇన్వెస్టర్లకు ఎనలిస్టుల "దసరా మాములు" స్టాక్ రెకమెండేషన్స్

Trending