నేరో రేంజ్ ట్రేడింగ్..! టాప్ గేర్‌లో ఆటో స్టాక్స్..! 3% దూసుకుపోయిన టాటా, మారుతి సుజికి,ఐషర్ మోటర్స్

2022-01-17 09:38:07 By Anveshi

img

మార్కెట్లు కొత్తవారాన్ని పండగ ఉత్సాహంతో ప్రారంభించాయ్. ఫ్లాట్‌గా ప్రారంభం అయినా, నిఫ్టీ 18300 పాయింట్లపైకి పెరిగింది. సెన్సెక్స్ వంద పాయింట్ల వరకూ లాభపడగా, ఆ తర్వాత ట్రేడింగ్ తిరిగి ఫ్లాట్‌గా మారింది

 

బ్యాంక్ నిఫ్టీ కూడా ఇదే బాటలో సాగుతుండగా, ఐటీ ప్యాక్ నష్టాలకు లోనవుతోంది. పవర్ ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లలో కొనుగోళ్ల సందడి కొనసాగుతోంది. మిగిలిన అన్ని సెక్టార్లు కూడా అంతంత మాత్రంగానే ట్రేడవుతున్నాయ్. ఆటో స్టాక్స్ మాత్రం భారీగా ర్యాలీ చేస్తున్నాయ్. ఓపెన్ అయిన పది నిమిషాల్లోనే ఈ సెక్టార్ ఒకటిన్నరశాతం లాభపడటం విశేషం


నిఫ్టీ గెయినర్లలో హీరోమోటోకార్ప్, టాటా మోటర్స్, మారుతి సుజికి, ఓఎన్‌జిసి, ఐషర్ మోటర్స్ 4 నుంచి ఒకటిన్నరశాతం వరకూ లాభపడ్డాయ్

 

లూజర్లలో హెచ్‌సిఎల్ టెక్, అల్ట్రాటెక్ సిమెంట్, ఏషియన్ పెయింట్స్, టైటన్ కంపెనీ, బ్రిటానియా టాప్ 5 లూజర్లుగా నిలిచాయ్


GAINERS

Expert's View


ఏ దేశ ద్రవ్యోల్బణం చూసినా ఏముంది గర్వకారణం ?

Trending