150 పాయింట్ల నష్టంతో ఆరంభం..! నెగటివ్ ట్రెండ్‌లో ఐటీ సెక్టార్..! ఆదుకునే ప్రయత్నంలో ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లు

2022-01-14 09:32:18 By Anveshi

img

మార్కెట్లు వీకెండ్‌లో వీక్‌గా ఓపెన్ అయ్యాయ్. నిఫ్టీ 150 పాయింట్లకిపైగా నష్టపోయింది.సెన్సెక్స్ దాదాపు 475 పాయింట్లు నష్టంతో ట్రేడింగ్ ఆరంభించింది. బ్యాంక్ నిఫ్టీ, ఐటీ ప్యాక్ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటుండగా, ఆయిల్ అండ్ గ్యాస్ మినహా అన్ని రంగాల షేర్లలో ప్లాటిష్ ధోరణే నమోదు అయింది


టిసిఎస్, ఇన్ఫోసిస్, విప్రో మూడో త్రైమాసికపు ఫలితాలు మార్కెట్లలో ప్రతికూలంగా ప్రభావం చూపుతున్నట్లు ఐటీ ఇండెక్స్ ట్రెండ్ చూస్తే అర్ధమవుతోంది. ఈ రంగం ఓపెనింగ్‌లోనే దాదాపు 600 పాయింట్లు నష్టపోవడమే ఇందుకు నిదర్శనం

 

టాప్ గెయినర్లను చూస్తే, ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్, మారుతి సుజికి, బిపిసిఎల్, రిలయన్స్, టాటామోటర్స్ 2 నుంచి అరశాతం లోపు లాభపడగా, లూజర్లలో హెచ్‌సిఎల్ టెక్, హెచ్‌డిఎఫ్‌సి, ఏషియన్ పెయింట్స్, యాక్సిస్ బ్యాంక్ విప్రో 3 నుంచి 2శాతం వరకూ నష్టపోయాయ్