మార్కెట్లను మెప్పించిన మానిటరీ పాలసీ!రేపటిపై ఆశతో 14800పైన ముగింపు

2021-04-07 12:32:42 By Anveshi

img

స్టాక్ మార్కెట్లని రిజర్వ్ బ్యాంక్ ఆప్ ఇండియా పాలసీ మెప్పించింది. దీంతో బుధవారం  ఓ హెవీ ర్యాలీ దిశగా మార్కెట్లు  పయనించాయ్. అన్ని సెక్టార్ల షేర్లలో కొనుగోళ్ల సందడి నెలకొన్నది. బ్యాంక్ నిఫ్టీ భారీగా పెరిగి నిఫ్టీ‌ని పుష్ చేయగా రీజనబుల్ డీసెంట్ ప్రాఫిట్స్‌తో ట్రేడింగ్ ముగిసింది.  నిఫ్టీ  బ్యాంక్ ఇండెక్స్  ఇంట్రాడేలో దాదాపు 600 పాయింట్లు పెరిగి 33వేల పాయింట్లపైనే ట్రేడైంది. స్టాక్ మార్కెట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ రూపంలో అండగా నిలవడంతో లాభాల్లో ముగిశాయ్. కీలకమైన వడ్డీ రేట్లను ఏ మాత్రం కదల్చకుండా యథాతథంగా ఉంచుతున్నట్లు ఆర్బీఐ  గవర్నర్ శక్తికాంతదాస్ ప్రకటించడంతో పాటు జిడిపిని 10.5శాతంగా అంచనాలను వెలువరించడం మన మార్కెట్లకు బాగా కలిసి వచ్చింది. దీంతో నిఫ్టీ 135 పాయింట్లు లాభపడి 14819 పాయింట్లు దగ్గర, సెన్సెక్స్ 460 పాయింట్లు లాభపడి 49661 పాయింట్ల వద్ద క్లోజ్ అయ్యాయ్

 

కన్జ్యూమర్ డ్యూరబుల్స్, హెల్త్‌కేర్, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లలోనూ ఇన్వెస్టర్లు ఇంట్రస్ట్ చూపించారు. దీంతో  సోమవారం నాటి వైరస్ వర్రీ నష్టాలను  పూడ్చుకుని, బుధవారం ఓ కొత్త మార్క్ క్రియేట్ చేసే దిశగా  కదలగా 14850 పాయింట్ల పైన నిరోధం కన్పించింది. దీంతో  చివరకు 14800 పాయింట్లకు కాస్త ఎగువన 14819 పాయింట్ల వద్ద నిఫ్టీ క్లోజైంది 

పిఎస్‌యు బ్యాంక్, ఐటీ,మెటల్, ఆటో స్టాక్స్ ఇండెక్స్ 1 నుంచి 2శాతం లాభపడగా, స్మాల్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్‌లో కొనుగోళ్ల మద్దతు కన్పించింది

టాప్ గెయినర్ల లిస్ట్‌లో జెఎస్‌డబ్ల్యూ స్టీల్ మరోసారి అగ్రస్థానంలో కొనసాగింది. దాదాపు నాలుగున్నరశాతం  పెరిగిన ఈ స్టీల్  కంపెనీకి ఇది వరసగా ఐదో లాభాల సెషన్. ఉదయం సెషన్‌లో పిఎఫ్‌సి,ఎస్బిఐ, భారతి ఎయిర్‌టెల్, రిలయన్స్ 2.96శాతం నుంచి 2.50శాతం  వరకూ పెరిగి ఇండెక్స్‌ని పుష్ చేయగా ముగింపు సమయానికి విప్రో 2.54శాతం, ఎస్బిఐ లైఫ్ ఇన్సూరెన్స్ 2.33శాతం, ఎస్‌బిఐ 2.28శాతం, బ్రిటానియా ఇండస్ట్రీస్ 2.09శాతం పెరిగి టాప్ 5 గెయినర్ల లిస్ట్‌లో చేరాయ్.

 

లూజర్లలో అదానీ పోర్ట్స్, టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్, యూపిఎల్,టైటన్ కంపెనీ, ఎన్‌టిపిసి రెండున్నర నుంచి 0.57శాతం వరకూ నష్టపోయాయ్

ఐతే ఇంతటి పాజిటివ్ మూడ్‌లో మార్కెట్లను వెంటాడుతున్న అంశం ఒక్కటే. గత 3 రోజుల్లో రెండుసార్లు లక్షకి మించిన వైరస్  కేసులు దేశంలో బైటపడటం. గడచిన 24 గంటల్లో లక్షా పదిహేనువేలమంది కొత్తగా కరోనా బారిన పడ్డారని ఆరోగ్యశాఖ ప్రకటించడంతో ఆ వర్రీ ఒకటి ట్రేడర్లను వెంటాడుతోంది. 

Expert's View


WHAT IS BITCOIN ? HOW TO INVEST IN CRYPTO CURRENCY ?

Trending