లిక్కర్‌ స్టాక్ లవర్స్‌కు తాజా ఖబర్..! దలాల్ స్ట్రీట్‌లో డాన్‌లలాగా దున్నేస్తున్న షేర్లు..ఐదు రోజుల్లో 5%-90% ర్యాలీ

2021-06-20 13:35:35 By Anveshi

img

స్టాక్ మార్కెట్లలో ఇప్పుడు ర్యాలీ సైక్లికల్‌గా నడుస్తున్న సంగతి గమనించే ఉంటారు. ఇదే క్రమంలో గత రెండు సెషన్లను  గమనిస్తే, లిక్కర్ స్టాక్ మంచి రిటన్స్ అందించాయ్.వాటిలో చిన్నా చితకా షేర్లు కూడా 25శాతం వరకూ గమనించడం చూస్తుంటే మందుబాబులకు సరుకు అందుబాటులోకి రానుండటమే ఈ ర్యాలీకి కారణంగా భావించాలి. లాక్‌డౌన్ తీసేసిన తర్వాత అమ్మకాలు బాగా పెరుగుతాయనే అంచనాలకు తోడు పెంటప్ డిమాండ్ ఊపందుకుంటుందనే అంచనాలు కూడా ఉన్నాయ్

 

కొన్ని కంపెనీల్లో కార్పొరేట్ సంబంధింత మార్పులు చోటు చేసుకోవడం కూడా ఈ స్టాక్స్‌లో ర్యాలీకి ఇతర కారణాలుగా చూడాలి. గ్లోబస్ స్పిరిట్స్ పరిస్థితే చూస్తే గత రెండు ట్రేడింగ్ సెషన్లలో సంస్థలోని 7,99,000 షేర్లను ఫ్లాంక్లిన్ స్ట్రాటజిక్ ఎమర్జింగ్ మార్కెట్ ఫండ్ విక్రయించింది. గత ఐదు సెషన్లలో ఈ షేరు బీభత్సంగా పెరిగి మదుపరులకు రూ.200లాభం పంచింది. అప్పర్  సర్క్యూట్స్‌తో పాటు 52 వారాల గరిష్టాలను తాకింది.  ఈ సంస్థ నికరలాభం కూడా గడచిన త్రైమాసికంలో రూ.50.63కోట్లకి పెరిగింది. 

 

రాడికో ఖైతాన్ పరిస్థితి కూడా అంతే క్యు4లో తన లాభాన్ని 90శాతం పెంచుకుని రూ.73.55కోట్లు గడించింది. ఇదే కాకుండా అసోసియేటెడ్ ఆల్కహాల్ అండ్ బ్రూవరీస్ కూడా మంచి లాభాన్ని గడించింది. ఈ మూడు సంస్థలు ఎక్స్ ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ తయారీలో ప్రసిద్ధిగాంచాయ్ 

 

చిన్న కంపెనీ అయిన రవికుమార్ డిస్టిలరీస్ కూడా రూ.11.90 నుంచి రూ.14 వరకూ వెళ్లడం గమనార్హం. 

కంపెనీ

జూన్ 14

జూన్ 18

5 డేస్ హై ప్రైస్

పయనీర్ డిస్టిలరీస్

రూ.130.90     

రూ.135.90     

రూ.137.65

యునైటెడ్ స్పిరిట్స్

రూ.643.40    

రూ.672.40

రూ.678.55

గ్లోబస్ స్పిరిట్స్

రూ.383.05

రూ.583.65 

రూ.583.65

రాడికో ఖైతాన్

రూ.709.80

రూ.785.95    

రూ.787

AA&B

రూ.448.85    

రూ.493.75

రూ.505.15

RKDL

రూ.11.90       

రూ.14.05      

రూ.14.15

 


( పై స్టోరీ పూర్తిగా ప్రాపిట్ యువర్ ట్రేడ్ సొంతం ..ఎక్కడో ప్రచురితమైనదానికి అనువాదం కూడా కాదు. లిక్కర్ షేర్ల కదలికల ఆధారంగా వ్రాసినది. ఇది ఇంకెక్కడైనా కన్పిస్తే అది మనదాన్ని చోరకళలో ప్రసిద్ధులైన ఇతర కథనశిఖామణులు ఎత్తిపోసినట్లుగా భావించవలసినదిగా మనవి)


GLOBUS UNITED RKDL SOM RADICO KHAITAN LIQOUR ENA PLANT BEER WINE SHARES RALLY FRANKLIN TELUGU