ఫ్రైడే మరీ డ్రైడే కాకుండా ఈ 4 టెక్నికల్ బెట్స్ చూడమంటోన్న కోటక్ సెక్యూరిటీస్ ! స్టాప్‌లాస్ మస్ట్

2021-06-18 08:29:04 By Anveshi

img

స్టాక్ మార్కెట్లలో బుధవారమే ఓ పెద్ద ఇన్సిడెంట్ ముగిసింది. మార్కెట్లు కాస్త నష్టాల్లో ముగిశాయ్. ఐతే గురువారం మాత్రం  న్యూట్రల్‌గానే సెంటిమెంట్ ఉంది. ఇదే మార్కెట్ ట్రెండ్ స్ట్రాంగ్‌గా ఉన్నట్లు తెలుపుతోంది. దీంతో నిఫ్టీ తిరిగి 15900,52800, 16000/53100 మార్క్స్ తాకుతాయని కోటక్ సెక్యూరిటీస్ అంచనా వేస్తోంది. ఐటీ, రిలయన్స్ అండతో నిఫ్టీ 15700 దగ్గరగా రాగలిగింది. శుక్రవారం కనుక నిఫ్టీ 15550 లెవల్‌కు పడకుండా ఉంటే, కొత్త గరిష్టాలకు ఎగయడం సాధ్యపడుతుంది

 

అలానే నిఫ్టీకి 15770,52500సెన్సెక్స్ కి హర్డిల్స్‌గా, ఆ తర్వాత 15850/52700 లెవల్స్ కీలకంగా మారినట్లు కొటక్  సెక్యూరిటీస్ రీసెర్చ్ టెక్నికల్ హెడ్ శ్రీకాంత్ చౌహాన్ చెప్తున్నారు. ఈ దశలో ఫ్రైడే ట్రేడింగ్ కోసం నాలుగు బెట్స్ వేశారు. మీరూ అవి చూడండి


 

ఐసిఐసిఐ ప్రు లైఫ్ 
సిఎంపి రూ.589.95
టార్గెట్ రూ.610
స్టాప్‌లాస్ రూ.580

ఎంగల్ఫ్‌డ్ క్యాండిల్ స్టిక్ ప్యాట్రెన్‌తో బ్రేకవుట్ నమోదు చేసింది. వాల్యూమ్స్ కూడా భారీగా పెరగడం స్టాక్ పాజిటివ్ ట్రెండ్‌కి సంకేతం


గ్రాసిం
సిఎంపి రూ.1458.2
టార్గెట్ రూ.1500
స్టాప్‌లాస్ రూ.1435

గ్రాసిం స్టాక్ ఇన్వర్టెడ్ హ్యామర్  క్యాండిల్ స్టిక్ ప్యాట్రెన్‌ను ముఖ్యమైన సపోర్ట్ జోన్ వద్ద ఫామ్ చేసింది. రాబోయే రోజుల్లో స్టాక్ రివర్స్ ట్రెండ్‌కి ఇది సంకేతమని శ్రీకాంత్ చౌహాన్ సూచించారు

 

 

పరిసిస్టెంట్
సిఎంపి రూ.2555.85
టార్గెట్ రూ.2630
స్టాప్‌లాస్ రూ.2515

అసెండింగ్ ట్రయాంగిల్ చార్ట్ ఫామ్ చేసిన పరిసిస్టెంట్ కౌంటర్‌లో మంచి వాల్యూమ్స్ నమోదు అవుతున్నాయ్. తొందర్లోనే  బ్రేకవుట్ వస్తుందని అంచనా

 


ఈఐడి ప్యారీ
సిఎంపి రూ.428.50
టార్గెట్ రూ.450
స్టాప్‌లాస్ రూ.420

 

గత కొద్ది  సెషన్లుగా ఈఐడి ప్యారీ కౌంటర్‌ కన్సాలిడేషన్‌లో ఉంది. ఇదే సమయంలో హ్యామర్ క్యాండిల్ స్టిక్ ప్యాట్రెన్‌ను స్టాక్ సపోర్ట్ జోన్ వద్ద ఫామ్ చేసింది.ఇదే ఈ కౌంటర్ బుల్లిష్‌గా మారనుందనే అంచనాకి సంకేతం

 

 

ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ 
కొనండి -వోల్టాస్ జూన్ ఫ్యూచర్స్ రూ.1030
స్టాప్‌లాస్ రూ.1000
టార్గెట్ రూ.1080

 ట్రెండ్ లైన్ సపోర్ట్ డైలీ చార్టులపై నమోదు అయింది రూ.1010 వద్ద పాజిటివ్ మొమెంటమ్‌తో ఈ గ్రాఫ్ నమోదు కావడం స్టాక్ మరో 70 రూపాయలు లాభం ఇస్తుందని రీసెర్చ్ హెడ్ - సహజ్ అగర్వాల్ చెప్తున్నారు

 

( పై స్టాక్ రికమండేషన్స్ ఆయా అనలిస్టులవి మాత్రమే, ప్రాఫిట్ యువర్ ట్రేడ్ సైట్‌వి కాదు, లాభనష్టాలకు ఇన్వెస్టర్లదే బాధ్యత)


icici pru lombard eid parry persistent grasim voltas futures june series trading technical bets telugu