లక్షతో మొదలైన ప్రస్థానం రూ.3వేల కోట్లకు చేరింది

2021-03-04 23:20:58 By Y Kalyani

img

లక్షతో మొదలైన ప్రస్థానం రూ.3వేల కోట్లకు చేరింది
70 ఏళ్ల వయసులోనూ అలుపెరగని ప్రయాణం
కొత్తరంగంలో సరికొత్త ఆశలతో...

ప్రాఫిట్ యువర్ ట్రేడ్ స్పెషల్

కష్టే.. ఫలి.. సుఖీ అంటారు కదా.. అయితే కష్టపడ్డారు.. ఫలితాన్ని సాధించారు.. 70 ఏళ్ల వయసులో సుఖ పడాలి కదా.. కానీ ఆయన ఈ వయసులో కూడా సుఖం వద్దని... ఇంకా కష్టానికి సిద్దపడ్డారు. కొత్త కంపెనీ పెట్టి ఇంకా యువతకు ఉపాథి అవకాశాలు కల్పిస్తామని చెబుతున్నారు ఆయనే దేశంలో పేరున్న కేరళ ప్రముఖ వ్యాపారవేత్త కొచోసోఫ్ చిట్టిలాపిల్లి. ఇంకా గుర్తుకురావడం లేదా.. అయితే  V-Guard కంపెనీ అధినేత. అవును ఆయన సాధించిన విజయం అసామాన్యం.. ఇంకా సాధించాలని తపన ఆయన సొంతం.

ప్రస్థానం...
కొచోసఫ్.. 43 ఏళ్ల క్రితం తన తండ్రి దగ్గర లక్ష రూపాయలు అప్పుగా తీసుకుని సొంత వ్యాపారం మొదలుపెట్టారు. ఇద్దరు వర్కర్స్ తో మొదలైంది. సరిగ్గా నాలుగు దశాబ్ధాల తర్వాత కంపెనీ దాదాపు రూ. 3వేల కోట్ల టర్నొవర్ కు చేరకుంది. 3వేల మందికి ప్రత్యక్షంగా ఉపాథి కల్పిస్తున్నారు. ఎలక్ట్రానిక్ గూడ్స్ నుంచి కిచెన్ అప్లయన్సెస్ వరకూ అన్నీ ఉత్పత్తులను అందిస్తోంది వీ గార్గ్ కంపెనీ. 70 ఏళ్ల వయసున్న చిట్టిలాపల్లి ఇప్పుడు ఇటీవల వీ గార్డ్ కంపెనీలో తన మెజార్టీ షేర్లు విక్రయించారు. అయితే రిటైర్ అయ్యి రెస్ట్ తీసుకుంటారని అంతా భావించారు.. కానీ మళ్లీ మొదటి నుంచి మొదలుపెట్టారు. కొత్తగా NBFCలో అడుగుపెడుతున్నారు. 

NBFCలో...
ఇప్పటికే రూ.5 కోట్ల ఇన్షియల్ ఇన్వెస్టిమెంట్ తో కంపెనీ ఫ్లోట్ చేశారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి కోరారు. సిండికేట్ బ్యాంకు ఛైర్మన్ గా పనిచేసి రిటైర్ అయిన జార్జ్ జోసఫ్ దీనిని హెడ్ గా ఉంటారు. ఒక్కసారి అనుమతి వస్తే కంపెనీ కార్యకలాపాలు మొదలవుతాయి. 
ప్రస్తుతం ఆయన వయసు 70 అయినా కొత్తగా మార్కెట్లోకి వస్తున్న యూత్ స్టార్టప్ లతో అదరగొడుతున్నారు. వాళ్ల సాయంతోనే ఆయన తన కొత్త కంపెనీతో వస్తున్నారు. ఈ రంగంలో అవకాశాలను తాను చూశానంటున్నారు. ఫ్యూచర్ మెరుగ్గా ఉంటుందని అంటున్నారు. అంతేకాదు.. కొత్త ఆలోచనలో వస్తున్నారు. ఇప్పటికే మార్కెట్లో ఉన్న NBFCల తరహాలో ఆస్తులు చూసుకుని.. బంగారం తాకట్టు పెట్టుకుని రుణాలు ఇవ్వబోవడం లేదన్నారు. రూ.10 లక్షల నుంచి కోటి రూపాయిల వరకూ కేవలం ఐడియాలను.. వారు చేసే వ్యాపారాన్ని నమ్మి లోన్లు ఇస్తామంటున్నారు పెద్దాయన. ముఖ్యంగా కేరళలో యువతను ప్రోత్సహించడం తమ లక్ష్యమంటున్నారు.

ఈక్విటీల్లోనూ....
అవును స్టాక్ మార్కెట్లో కూడా ఇన్వెస్ట్ చేస్తామంటున్నారు కొచోసఫ్. 
కంపెనీ పెట్టినప్పుడు ఈ స్థాయిలో విజయం అందుకుంటామని ఊహించలేదు.. వచ్చిన విజయాన్ని నలుగురుతో సంతోషంగా పంచుకున్నాం.. ఇప్పుడు కూడా ఎంతో కొంత సేవ చేయాలన్న తపనతో ఉన్నామంటున్నారు ఈ పెద్దాయన నిజంగానే బెస్ట్ సక్సెస్ మెన్.

( జాతీయా మీడియా సంస్థలతో పలు సందర్భాల్లో చెప్పిన సమాచారం ఆధారంగా ఈ కథనం..) 

Expert's View


WHAT IS BITCOIN ? HOW TO INVEST IN CRYPTO CURRENCY ?

Trending