హీనంగా చూస్తే..ఘోరంగా దెబ్బతినక తప్పదా..? ITC నాలుగడుగులు వెనక్కి వేసిందంతే..! ర్యాలీ బిగినైతే మరో టాటా మోటార్సేనట..!

2021-10-22 15:41:20 By Anveshi

img

గత వారం ITC స్టాక్‌ని చాలామంది రికమండ్ చేశారు. ఐతే ఇంతలోనే షేరు ధరకి ఏదో పూనకం వచ్చినట్లుగా పదిశాతం కిందకు పడిపోయింది. దీంతో ఈ స్టాక్‌ ఇక ఇప్పట్లో లేవదని, బడ్జెట్‌లో సిగరెట్, పొగాకుపై పన్ను విధింపుపై ఓ క్లారిటీ ఇచ్చేవరకూ ఇంతే లగార్డ్‌గా ఉండిపోతుందనే ప్రచారం బయలు దేరింది.ఐతే ఇందులో వాస్తవమెంత అంటే, కొందరు అనలిస్టులు మాత్రం అసలు ITC వేల్యూ ఇది కాదని..టాటా మోటర్స్ ఎలాగైతే ఒక్కసారిగా జూలు విదిల్చిందో..అలానే ఐటిసి కూడా కొత్త నంబర్లకు చేరబోతుందని ఢంకా బజాయించి చెప్తున్నారు

 

రీజన్స్ ఫర్ రికమండేషన్
గత కొద్ది రోజులుగా ఎఫ్ఎంసిజి రంగంలో బీభత్సమైన వ్యాపారం సాగింది. అందులో మార్జిన్లు, లాభం విపరీతంగా పెరిగిపోయింది. లిస్టెడ్ కంపెనీల కంటే కూడా అన్‌లిస్టెడ్ సేల్స్ చూసినవాళ్లు ఈ మాట చెప్తున్నారు. అందుకే ఐటిసి లాంటి అసలు సిసలు ఇండియన్ ఎంఎన్‌సి..కాంగ్లోమెరేట్ కంపెనీకి రాబోయే రెండు మూడు క్వార్టర్లలో భారీ లాభం ప్రకటించబోతుందని అంచనాలేస్తున్నారు.  ఇక్కడ్నుంచి కూడా అటు స్టాక్ రేటు డబుల్ కావడం, ఎబిటా నంబర్లు కూడా రెట్టింపు కావడం తొందర్లోనే గమనిస్తామంటున్నారు. ఇదే స్టాక్ ధరలో జడత్వాన్ని తొలగిస్తుందనేది వారి ఒపీనియన్

 

ఐటిసిలో పేపర్ విభాగం ఉంది. ఆగ్రో సెక్టార్ ఉంది. టుబాకో, ఎఫ్ఎంసిజి ప్రొడక్ట్స్, ఎక్స్‌పోర్ట్ రిలేటెడ్ బిజినెస్ ఉన్న ఐటీసి వ్యాపారంలో సిగరెట్ల వాటా చాలా పెద్దది, ఓరకంగా ఐటిసికి కామధేనువులాంటిదని చెప్పాలి. ఈ సెగ్మెంట్‌లో ఐటిసీ మోనార్క్ కూడా 

 

మరి పైన చెప్పిన పేపర్ స్టాక్స్ భారీగా పెరుగుతున్నాయ్. ఎఫ్ఎంసిజి సెక్టార్ డిటో, టుబాకో ఎగుమతి భేషుగ్గా ఉంది. ఐతే ఈ పొగాకు ఎగుమతులపై ఓ సమీకృత పాలసీ కోసం ఇండస్ట్రీ ఎదురు చూస్తుంది. అది కనుక బడ్జెట్‌లో ప్రవేశపెడితే, ఈ విభాగంలోనూ ఐటిసికి తిరుగుండకపోవచ్చు

 

ఐతే ఉన్నట్లుండి అమ్మకాల ఒత్తిడి పెరిగింది. రెండు రోజుల్లో పదిశాతం పడిపోయింది. దీనికి కారణం, సింపుల్ ఇతర కంపెనీలు ఇబ్బడి ముబ్బడిగా షేరు ధర రూపంలో లాభం పంచుతుంటే, ఇదే ఎందుకు ఉంచుకోవాలనేది మదుపరుల ఆలోచన. అందుకే సోషల్ మీడియాలో మీమ్స్ ఐటిసిపై బాగా పేలుతున్నాయ్. ఐనా సరే కొత్త తరం ఇన్వెస్టర్లు ఇందులో పెట్టుబడికి ముందుకు వస్తున్నారు. ఒక్క సిగరెట్లపై పన్ను విధిస్తారేమో అనే భయం వీరిలో లేదు. వీళ్లు ఈ కంపెనీ గ్రోత్ స్టోరీ మాత్రమే చూస్తున్నారు.

 

అసలు జిఎస్టీ రెవెన్యూలో సిగరెట్లపై వసూలు చేస్తున్న మొత్తం చాలా ఎక్కువ. అందుకే ఈ పన్ను మినహాయింపులు ఉండవ్. పన్నులు పెంచినా, సరే వినియోగంలో  తగ్గుదల అసలు కన్పించని సెగ్మెంట్ సిగరెట్స్, లిక్కర్. కాబట్టి ఆ పన్ను భయాలు వదిలేయండని వెంచురా సెక్యూరిటీస్ తన నివేదికలో పేర్కొన్నది

 

ఐటీసి షేరు శుక్రవారం ట్రేడింగ్‌లో  రూ.236.50 వద్ద  ముగిసింది
 


ITC VENTURA BUY TAMO TATAMOTORS RALLY

Expert's View


మంచి కంపెనీల IPO లకు ఎందుకు ఆదరణ కరువైంది ?

Trending