గంగ వెర్రులెత్తిపోయిన ఐటీ స్టాక్స్..! ఊచకోతకి గురైన షేర్లు, దిగ్గజాలన్నీ నేలకు దిగినవేళ ! 5-8శాతం నష్టపోయిన ఇన్ఫోసిస్,టిసిఎస్,టెక్ మహీంద్రా ...!

2022-05-19 14:45:07 By Anveshi

img

గురువారం ట్రేడింగ్‌లో ఐటీ సెక్టార్ మొత్తం పడకేసింది. ఫ్రంట్ లైన్ స్టాక్స్‌గా పేరుపొందినవి, నిఫ్టీలో హెవీ వెయిట్  ఉన్న స్టాక్స్‌, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగాల్లో దిగ్గజాలనుకున్న కంపెనీల షేర్లన్నీ అమాంతంగా ఊచకోతకు గురవుతుంటే ట్రేడర్లు, ఇన్వెస్టర్లు గుడ్లప్పగించేసి చూస్తున్న పరిస్థితి . ఇదే ఇవాళ్టి అనివార్యమైన దృశ్యం

 

అమెరికాలో కార్పోరేట్ సెక్టార్‌ దారుణంగా దెబ్బతిన్నదని, ఇక ఐటీ స్పేస్‌లో ఖర్చులు తగ్గించుకుంటాయనే వార్తల నేపథ్యంలో మన ఐటీ స్టాక్స్ దారుణంగా అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయ్. ఈ దెబ్బకి ఐటీ ఇండెక్స్ ఏకంగా 6 శాతం పతనం అయింది

 

ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, ఎల్ అండ్ టి ఇన్ఫోటెక్, విప్రో, కోఫోర్జ్, ఎంఫసిస్, మైండ్ ట్రీ సంస్థల షేర్లు  ఏకంగా 5 నుంచి 8శాతం వరకూ నష్టపోగా,  టిసిఎస్, హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ వరసగా 4,5 శాతం నష్టపోయాయ్

 

గత నెలలో అంటే ఏప్రిల్ 18న కూడా ఇలానే ఐటీ ఇండెక్స్ 5.1 శాతం పతనంఅయింది

 

దేశీయ బ్రోకరేజ్ సంస్థ నిర్మల్ బంగ్ అంచనా ప్రకారం అమెరికాలో విల్లింగ్ టు స్పెండ్ నుంచి ఎబిలిటీ టు స్పెండ్ పద్దతికి కార్పొరేట్ కంపెనీలు మారతాయి. అంటే ఐటీ రంగంలో పెట్టుబడికి ఇష్టపడటం అనే ధోరణి నుంచి ఖర్చు పెట్టే స్తోమత ఉన్న కంపెనీలే పెట్టుబడి పెడతాయనేది ఇందులోని అర్ధం.

 

ఈ సంస్థతో పాటు ఇతర కంపెనీలు కూడా ఐటీ స్టాక్స్‌ పిఈ టార్గెట్‌లను తగ్గించేపనిలో పడ్డాయ్

 

ఇవాళ్టి ఐటీ స్టాక్స్ పెర్ఫామెన్స్ చూడండి