రిలయన్స్ రిజల్ట్స్ చెప్తున్నదేంటి..? షేరు ధర రూ.10వేలవుతుందా..? 5 ఏళ్లలో మల్టీ బ్యాగర్ అవనుందా..?

2021-10-23 15:54:22 By Anveshi

img

ఈ ఆర్ధిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లాభం రూ.13680 కోట్లుగా నమోదైంది. అంచనాలను కూడా తలకిందులు చేసి మరీ ఈ రేంజ్ లాభాలను ఆర్ఐఎల్ సాధించింది.  ఎబిటాలు, నెట్ ప్రాఫిట్‌లు, మార్జిన్లు ఇవన్నీ పక్కనబెట్టండి..అసలు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏం చేయబోతోంది..ఏం సాధించబోతోంది. పెద్దగా ఎవరూ ఊహించని గ్రోత్ స్టోరీ ఇఁదులో దాగి ఉందా..? కేవలం షేరు ధర పెరగడం కాదు అంతకి మించి రిలయన్స్ సాధించబోతోందా ..తరచి చూస్తే..అవుననే చెప్పాలి

 

ఒక మూడు నెలల ఆదాయం దాదాపు 2లక్షల కోట్లు..అంటే ఓ రాష్ట్రం బడ్జెట్‌తో సమానం. మరి షేరు ధర చూడండి రూ.2600 ఇదే ఇతర స్టాక్స్ చూడండి..ఆదాయం బారెడు, ఆస్తి మూరెడు, ఖర్చులు చారెడు..అయినా వాటి ధరలు 3వేలు..4వేలు పలుకుతాయ్. ఈ పోలిక కూడా వదిలేయండి

 

ఫేస్‌బుక్ షేరు ధర 24వేల రూపాయలకి పై మాటే..మరి ఆదాయం? 992 బిలియన్ డాలర్లు
ఆపిల్ కంపెనీ షేరు వేల్యూ 148 డాలర్లు అంటే మన కరెన్సీలో 11,249 రూపాయలు- ఐతే ఆపిల్ ఆదాయం  2.4 'ట్రిలియన్ డాలర్లు
మైక్రోసాఫ్ట్ షేర్ వేల్యూ 310 డాలర్లు మన కరెన్సీలో రూ. 23247..దీని ఆదాయం  2.14 ట్రిలియన్ డాలర్లు
అమెజాన్-1.48 ట్రిలియన్ డాలర్ల కంపెనీ...మరి వీటితో రిలయన్స్ ఇండస్ట్రీని పోల్చడం అమాయకత్వం, అజ్ఞానమే అవుతుంది. కానీ వీటి వ్యాపారం వేరు. ఇవి ప్రొడక్ట్ బేస్డ్ ఒకటైతే, మరొకటి టెక్ దిగ్గజం, మరొకటి టెక్ ప్లాట్‌ఫామ్, ఇంకొకటి ఆగ్రిగేటర్, టెక్ కంపెనీ..మరి రిలయన్స్ ఏంటి..? దానికి సమాధానం కనుక్కునే ప్రయత్నమే ఇప్పుడు ముకేశ్ అంబానీ చేస్తున్నట్లు కన్పిస్తోంది

 

ఇండియా జనాభా 137 కోట్లు. ఇంత పెద్ద దేశంలో రిటైల్ షాపుల రివల్యూషన్ ఇప్పుడే పీక్ స్టేజ్‌కి చేరుకుంది. అలానే స్మార్ట్ ఫోన్ల వాడకం కూడా వీటికి తోడు డిజిటల్ పేమెంట్ల వ్యవస్థ విస్ఫోటమైంది. ఇక ప్రపంచానికి పెద్ద ఆక్సిజన్‌గా ఉన్న మరో రంగం, ఇంధనం. ఇదిగో సరిగ్గా ఈ నాలుగు రంగాల్లో రిలయన్స్ తన వేళ్లని మరింత విస్తరించబోతోంది.

 

ప్రపంచంలోనే అన్ని దేశాలకు తెలిసిన కంపెనీలంటే..ఇందాక పైన చెప్పిన పేర్లే విన్పిస్తాయ్..మన దేశం నుంచి యోగా, ఆయుర్వేదం, దేవతలు, పూజలు, దేవాలయాలు, సంస్కృతి మాత్రమే చెప్పుకోవాలి. సేవాభావం అనేది మనకి జీర్ణించుకుపోయిన అంశం కాబట్టే..మనం ఎక్కడా ఏ ఉత్పత్తి కొత్తగా తయారు చేయలేదు( కనీసం నవీన భారతంలో) అందుకే ఐటీ ప్రొడక్ట్స్ ఇతర దేశాలు చేస్తే..వాటి సర్వీస్ మనం అందిస్తున్నాం. ఇక టూరిజం, హాస్పిటల్, హాస్పిటాలిటీలోనూ ఇదే రకమైన 
ముందంజలో ఉన్నాం..మరిలాంటప్పుడు మన దేశపు కంపెనీల గురించి ఎక్కడో సముద్రాల ఆవల ఉన్నవారికి ఎలా తెలుస్తుంది..? ఇదిగో ఇప్పుడు తెలుస్తుంది

 

రిలయన్స్ ఆయిల్ 2 కెమికల్ బిజినెస్‌లో సౌదీఆరామ్‌కోతో జట్టు కట్టింది. ఆ చైర్మన్‌ని కూడా బోర్డులోకి తీసుకుంది. దీంతో ఆయిల్ రంగంలో RIL తన సామ్రాజ్యాన్ని ఇతర దేశాలకు విస్తరించనుంది.

 

రిటైల్ ఇండస్ట్రీని ప్రపంచవ్యాప్తం చేయడానికే రిలయన్స్ అధినేత ఈ మధ్య వరసగా టేకోవర్లు చేస్తున్నారు. 7లెవన్ అందులో భాగమే, దీనికి ముందు ఫ్యూచర్ రిటైల్ ఈ పాటికి రిలయన్స్ పరం కావాల్సింది. ఇప్పుడా స్థానంలో ఇంటర్నేషనల్ ఎక్స్‌పోజర్‌ ఉన్న సెవెన్ లెవన్‌ను ఫ్రాంచైజీ రూపంలో నిర్వహించడం ద్వారా తన విస్తృతి పెంచుకుంది. అలానే మనీష్ మల్హోత్రా డిజైనర్ వేర్‌లో వాటా కొనుగోలుతో తమ ఫ్యాషన్ ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియో పెంచుకుంది. రీతూ కంపెనీ విషయం కూడా ఇదే కోవలోకి వస్తుంది. మరి రిటైల్ వస్తువులకి మార్కెటింగ్ మాటేంటి..? 40 కోట్లమంది జియో యూజర్లే దానికి పెద్ద బేస్. ఓ వైపు వరల్డ్ టాప్ టెల్కోలలో ఒకటిగా జియో ఆవిర్భవించడం  మరోవైపు తమ ఉత్పత్తులకు ఓ వేదిక ఏర్పాటు చేయడం జియో ప్లాట్‌ఫామ్ ద్వారా సాధ్యపడుతుంది. అంతేకాదు జస్ట్ డయల్‌ కొనుగోలుతో కస్టమర్ల డేటా బేస్ కూడా అందుబాటులోకి తెచ్చుకుంది. ఇప్పుడు చెప్పండి ముకేశ్ అంబానీ ప్రపంచంలోనే అతి పెద్ద రిటైల్ కంపెనీగా రిలయన్స్ రిటైల్‌ను నిలబెట్టడంలో సక్సెస్ అవుతారా లేదా..?

 

ఇక డిజిటల్ పేమెంట్ల కోసం ఇప్పటికే అటు రిలయన్స్ రిటైల్, వాట్సాప్ భాగస్వామ్యంతో తమ ఫోన్లపై పేమెంట్ సర్వీస్ కూడా ప్రారంభించారు. ఈ పరిణామాలన్నీ వ్యాపారంలో భాగమైతే..లండన్,యూకేలలో ఖరీదైన విల్లాలు, రిసార్ట్‌లు కొనుగోలుతో ఆతిధ్యరంగంలోనూ రిలయన్స్ తన ఫోకస్ పెట్టింది. ఇది పైకి ఏదో ఒకటి రెండు టేకోవర్లలా కన్పిస్తున్నాయ్, కానీ ప్రపంచపటంలో ఒకప్పుడు కొన్ని కంపెనీల పేర్లు తెగ విన్పించేవి. తర్వాతికాలంలో అవి కనుమరుగు అయ్యాయ్. అలానే ఇప్పుడున్న దిగ్గజ కంపెనీలు వాల్‌మార్ట్, మైక్రోసాఫ్ట్, గూగుల్,ఫేస్‌బుక్‌కి పోటీగా కాకపోయినా, వాటి సరసన నిలబడగల ఏకైక ఇండియన్ కాంగ్లోమెరేట్ కంపెనీగా రిలయన్స్‌ ప్రయత్నాలు చేస్తోంది. ఇంత గ్రోత్ స్టోరీ ఉన్న రిలయన్స్ షేర్లు ఇప్పుడు పదివేల రేటుకి చేరడం పెద్ద విషయం కానే కాదు..కానీ అదెప్పుడనేదే  ఇన్వెస్టర్ల ఆసక్తి
ఎందుకంటే..ఇప్పటిదాకా ఇండియన్ కార్పొరేట్ కంపెనీలు ఎదిగిన తీరు వేరు..ఇక్కడ్నుంచి అవి దూసుకుపోయే వేగం వేరు మరి...!

 

( ఈ కథనం రిలయన్స్ పొటెన్షియల్ గురించిన అంచనా, అంతేకానీ ఈ షేరునే కొనాలని రికమండ్ చేయడం కాదని గ్రహించగలరు)
 


RIL RELIANCE RETAIL JIO SHARE RALLY MULTIBAGGER

Expert's View


మంచి కంపెనీల IPO లకు ఎందుకు ఆదరణ కరువైంది ?

Trending