IOC డిస్ట్రిబ్యూషన్ రంగంలో రూ.7వేల కోట్లు పెట్టుబడి చేయబోతోంది. ఇప్పటికే జమ్ము, పఠాన్ కోట్, సికార్, జలగావ్,గుంటూరు ట్యుటికోరిన్, తిరునల్వేలి, కన్యాకుమారి, మదురై, ధర్మపురి, హాల్దియా వంటి జిల్లాల్లో తన మార్కెట్ షేర్ని 33శాతం పెంచుకున్న ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్, దేశంలోని పలు నగరాల్లో డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ని పెంచేందుకు వ్యూహం సిద్ధం చేసింది. ఇందుకోసమే రూ.7వేల కోట్లు ఇన్వెస్ట్ చేయబోతున్నట్లు ప్రకటించింది
సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ బిడ్లలో ఇప్పటికే 11రౌండ్లలో ఐఓసి 33శాతం వాటా దక్కించుకోగా, మొత్తం 61 ఏరియాలు ఇలా వేలానికి పిలవబడ్డాయ్. IOCకి సిజిడి బిడ్డింగ్‌లో 9లైసెన్సులు దక్కాయ్. తనకి దక్కిన లైసెన్సులతో ఇండియనా్ ఆయిల్ కార్పొరేషన్ సిఎన్ గ్యాస్‌ని ఇళ్లకి మాత్రమే కాకుండా, ఆటోమొబైల్స్‌కి కూడా గ్యాస్ సరఫరా చేస్తుంది
మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కి 15 లైసెన్సులు దక్కగా, అదానీ టోటల్ గ్యాస్‌కి 14 లైసెన్సులు దక్కాయి. ఐతే దేశంలోనేఅతి పెద్ద డిస్ట్రిబ్యూటర్ ,గ్యాస్ నెట్వర్క్ ఉన్న ఐఓసీతో పోల్చుకుంటే వీటి సరఫరా చాలా తక్కువే
ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ షేర్లు గత ట్రేడింగ్ సెషన్లో రూ.123.30 వద్ద ముగిశాయ్