బీట్స్ ది ఎస్టిమేట్స్: ఇరగదీసిన ఇన్ఫోసిస్ ! Q2లో 12% జంప్ చేసిన ప్రాఫిట్! రూ.15 డివిడెండ్

2021-10-13 16:39:01 By Anveshi

img

ఐటి ఇండస్ట్రీలో  ఫ్యాన్సీ కంపెనీ ఇన్ఫోసిస్ రెండో త్రైమాసికంలో ఆర్ధిక ఫలితాలను
నికరంగా అదరగొట్టింది. 11.9శాతం ( దాదాపు 12శాతం) వృద్ధితో రూ.5421 కోట్ల నికరలాభం ప్రకటించింది. ఈ లాభం ఏటికేడాది ప్రాతిపదికన చూస్తే 11.9శాతం, క్వార్టర్ ఆన్ క్వార్టర్‌తో పోల్చితే 4.4శాతానికి  సమానం


దేశంలోనే రెండో పెద్ద ఐటీ కంపెనీ అయిన ఇన్ఫోసిస్ ఆదాయం కూడా మంచి వృద్ధినే సాధించింది క్యు1లో రూ.27896కోట్ల ఆదాయం ఆర్జించిన ఇన్ఫోసిస్, రెండో త్రైమాసికంలో రూ.29602 కోట్ల ఆదాయం గడించింది. అలానే షేరు హోల్డర్లకు షేరుకు రూ.15 డివిడెండ్ ఇస్తున్నట్లుగా ప్రకటించింది


ఈ నంబర్లు స్ట్రాంగ్‌గా రావడానికి దైమ్లర్ కంపెనీ డీల్ బాగా కలిసి వచ్చిందని తెలుస్తోంది. సంస్థ క్లయింట్లు డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ వైపు వేగంగా మళ్లడం, అన్ని విభాగాల్లోనూ మంచి వృద్ధి నమోదు కావడంతోనే సాధ్యపడింది

 

దైమ్లర్ కంపెనీ-డేటా సెంటర్ల ట్రాన్స్‌ఫర్మేషన్‌తో పాటు, శాప్ బేస్డ్ సర్వీస్‌ ఇచ్చేందుకు ఇన్ఫోసిస్‌తో గత డిసెంబర్‌లో దీర్ఘకాలిక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్ 3.2 బిలియన్ డాలర్లకు సమానం.

 

ఇక రెవెన్యూ గైడెన్స్ విషయానికి వస్తే, గతంలో ఇచ్చినటువంటి 14-16శాతాన్ని ఇన్ఫోసిస్ మరింత పెంచింది. 16.5-17.5 మధ్యలో రెవెన్యూ ఉంటుందని అలానే మార్జిన్ గైడెన్స్ మాత్రం 22.24శాతంగా నమోదు కావచ్చని ప్రకటించింది. టాప్ లైన్‌లో 6.3శాతం, నమోదు కాగా, కాన్‌స్టంట్ కరెన్సీ టర్మ్స్‌లో 
42.4శాతం గ్రోత్ నమోదు కావడం విశేషం

 

ఆపరేటింగ్ మార్జిన్ల విషయంలో మాత్రం ఇన్ఫోసిస్ 10 బేసిస్ పాయింట్లు క్షీణించి 23.6శాతంగా నమోదు అయింది. ఈ క్వార్టర్‌లో కంపెనీ 2.15 బిలియన్ డాలర్ల మేర కొత్త డీల్స్ చేజిక్కించుకున్నట్లు కంపెనీ ఫలితాల విడుదల సందర్భంగా చెప్పింది

 

ఇవాళ్టి మార్కెట్లలో ఇన్పోసిస్ షేర్లు 1.2శాతం లాభంతో రూ.1705 రేటు వద్ద ముగిశాయ్


INFOSYS MARKET CAPITALISATION 7 LAKH CRORE RUPEES Q2 NET PROFIT BEATS ESTIMATES

Expert's View


ఇన్వెస్టర్లకు ఎనలిస్టుల "దసరా మాములు" స్టాక్ రెకమెండేషన్స్

Trending