ద్రవ్యోల్బణం దెబ్బ ధనికులకేనట..! కిందవాళ్లకి కాస్తేనంటూ ఆర్థికశాఖ స్వాతిముత్యపు పలుకులు

2022-05-13 07:28:26 By Anveshi

img

 

" ఉల్లిపాయలు మా ఇంట్లో వండుకోం"

" ద్రవ్యోల్బణం అనుకున్నంత భారీగా లేదు"

"మేనేజ్ చేయొచ్చు సమస్యేం కాదు.."

ఈ జాతిరత్నాల్లాంటి పలుకులకు ఇప్పుడు కొత్త మాట కూడా తోడైంది.  

 

" ద్రవ్యోల్బణం దెబ్బ ధనికులకే ఎక్కువ పేదవారితో పోల్చితే " అంటూ కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది..మొదటి మూడు మాటలు ప్రత్యక్షంగా ఆర్థిక మంత్రి గారి నోటి నుంచి జాలువారితే, తాజాది మాత్రం ఓ నివేదికలో పొందుపరిచారు. 

 

దేశంలో ఇప్పుడు  ఉప్పు పప్పు సహా ఏ వస్తువు రేటు చూసినా భారీగా పెరిగిపోతే, ఆ దెబ్బ కేవలం ధనికులపైనే ఎక్కువ అంటూ  ఇలాంటి చెత్త నివేదికలను ఇవ్వడం వెనుక పరమార్ధమేంటి..? 

 

ఏప్రిల్ నెలలో కన్జ్యూమర్ ప్రైస్ ఇన్‌ఫ్లేషన్ విడుదలకి గంట ముందు ఆర్థిక శాఖ ఓ నివేదిక బైటపెట్టింది. దాని ప్రకారం వినియోగం అవుతున్న తీరుని బట్టి చూస్తే, ధనికులకంటే పేదవారిపై చాలా తక్కువ ప్రభావమే, ద్రవ్యోల్బణం చూపింది 


"Evidence on consumption patterns further suggests that inflation in India has a lesser impact on low-income strata than on high-income groups," అంటూ చెప్పుకొచ్చింది. ఇంతకంటే దిక్కుమాలిన నివేదిక ఉంటుందా..? 

 

వంటనూనెల ధరలు లీటర్‌కి రూ.90 నుంచి రూ.200కి ఎగబాకిన తర్వాత కూడా ఇంకా అల్పాదాయ వర్గం, మధ్యతరగతి వర్గం గతంలోలాగా వాటిని వాడగలదా..ఆయా వర్గాలు వాడటం తగ్గించారు కాబట్టి..ఇక అవి వాడేది ధనికులే అని చెప్తూ..సమస్యని తక్కువ చేసి చూపించే ఇలాంటి ప్రయత్నాలను ఏమనాలి..?

 

నిజంగా ధనికులకే ఆ సమస్య ఉంటే, రిజర్వ్ బ్యాంకాఫ్ ఇండియా అంత ఆదరాబాదరగా మే 4 మధ్యాహ్నం 2 గంటలకు వడ్డీ రేట్లు ఎందుకు పెంచింది..? ఎందుకు శక్తికాంతదాస్ దేశంలోని పేదవారిపై విపరీతమైన ప్రభావం చూపుతుందంటూ ద్రవ్యోల్బణం గురించి ప్రస్తావించారు..? 

 

ఇక ఈ కేంద్రఆర్థికశాఖ నివేదికలో ఏముందో మనకి అనవసరం..ఏదేదో లెక్కలు చూపించి తమ వాదనకి మద్దతుగా నాలుగు అంకెలు చూపించుకునేవారితో వాదించడం వేస్ట్..పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగితే..ఎలక ఏం చేస్తుందో తెలుసు కదా..!


Expert's View


ఏ దేశ ద్రవ్యోల్బణం చూసినా ఏముంది గర్వకారణం ?

Trending