బ్లాక్ ఫ్రైడే : 412 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ , సెన్సెక్స్ 1400 పాయింట్లు పతనం: సింగిల్ డే బిగ్గెస్ట్ లాస్..! బిళ్లబీటుగా పడిపోయిన స్టాక్స్; పతనానికి కారణాలివే

2021-11-26 11:01:54 By Anveshi

img

స్టాక్ మార్కెట్లకు బ్లాక్ ఫ్రైడేగా నవంబర్ 26 మిగిలిపోనుంది. ఇంట్రాడేలో ఇప్పటికే నిఫ్టీ 412 పాయింట్లకిపైగా పతనం అయింది. మరోవైపు సెన్సెక్స్ భారీగా 1400 పాయింట్లు నష్టపోయింది.

 

కొత్త వేరియంట్ ఒకటి కరోనా ఫ్యామిలీలో అత్యంత ప్రభావవంతంగా, ప్రమాదకరంగా మారిందని సౌతాఫ్రికా సహా ఇతర దేశాల్లో వ్యాపించినట్లుగా ప్రచారం సాగుతోంది. దీనిపై నిన్ననే ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఓ హెచ్చరిక చేసింది. అసాధారణం, అత్యంత ప్రమాదకరం అంటూ ఈ వైరస్
స్ట్రెయిన్‌ని వర్గీకరించడం మన మార్కెట్ల కొంపని ముంచింది

దీంతో ఓఎన్‌జిసి, టాటా మోటర్, కోటక్ మహీంద్రా , టాటా స్టీల్, మారుతి సుజికి, హిందాల్కో బజాజ్ ఫిన్ సర్వ్ తీవ్రంగా నష్టపోగా ఫార్మా స్టాక్స్‌లో జోరు భారీగా ఉంది.  డా.రెడ్డీస్, సిప్లా,సన్ ఫార్మా తదితర షేర్లు ఎక్కువగా లాభాల్లో ట్రేడవుతున్నాయ్

52 వారాల కనిష్టాలకు బాంబే బర్మా ట్రేడింగ్, హీరో మోటోకార్ప్ , ఎస్సెల్  ప్రోప్యాక్, జాన్సన్ హిటాచి, స్పందనస్ఫూర్తి పతనం కాగా 

ఇప్పుడిప్పుడే పైకి లేస్తోన్న ఐనాక్స్ లీజర్, పివిఆర్, ఇండియన్ హోటల్స్, చారియట్ హోటల్స్  ఫినిక్స్ మిల్, డెల్టా కార్ప్ హోమ్ ఫస్ట్ ఫైనాన్స్ పది నుంచి 7శాతం వరకూ నష్టపోయాయ్

 

మార్కెట్ల నష్టాలకు కారణాలను వెతకగా, 

1. సౌతాఫ్రికాలో కొత్త వేరియంట్

2. కొత్త లాక్‌డౌన్లు-యూరప్,క్రెజ్ స్లోవేకియాలో లాక్‌డౌన్ విధించారు..ఇది ప్రపంచవ్యాప్తంగా  అలముకుంటుందేమో అన్న ఆందోళన


3. ఎప్ఐఐలు తమ పెట్టుబడులు వెనక్కి తీసుకుంటుండం. రూ.2300 కోట్ల మేర ఈక్విటీల్లో FIIలు విక్రయాలు చేసారు


4.థ్యాంక్స్ గివింగ్ హాలిడే, అమెరికాలో బాండ్ ఈల్ట్స్ పడిపోవడం


5. జపాన్ మార్కెట్ల పతనం,ఆసియా మార్కెట్లలో ప్రతికూల వాతావరణం


DOWN VIRUS MARKETS SELLOFF

Expert's View


మంచి కంపెనీల IPO లకు ఎందుకు ఆదరణ కరువైంది ?

Trending