దైర్ నేమీజ్ బాండ్.. గోల్డ్ బాండ్..గోల్డ్ బాండ్స్ 10 ! కొత్త సిరీస్‌కి కౌంట్ డౌన్

2021-10-23 17:24:38 By Anveshi

img

బంగారం డిమాండ్ ఎంత తగ్గినా పెరుగుతూనే ఉంటుంది..ఈ లైన్ ఏంటి తేడాగా ఉందనుకోవద్దు..దాని అర్ధం గోల్డ్ రేటు పడినా పెరిగినా, కొనేవాళ్లకి కొదవ ఉండదనేదే భవదీయుడి భావం. బంగారంపై మనోళ్లకి ఉన్న మోజుని దృష్టిలోపెట్టుకునే కేంద్రం సావరిన్ గోల్డ్ బాండ్ల పథకం ప్రవేశపెట్టింది. ఇప్పటికే 9 అంచెలు పూర్తి చేసింది. 

 

బాండ్ల కొనుగోలుకి ముందు మూడు రోజుల ధర సగటున చూసి ఆ రేటు ప్రకారం ఈ బాండ్లకి రేటు నిర్ణయిస్తారు. ఒక్కోరు గరిష్టంగా 4 కేజీల వరకూ కొనుక్కోవచ్చు. బ్యాంకులు, సెంట్రల్ డిపాజిటరీ ఆఫ్ ఇండియా, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, క్లియరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఎన్ఎస్ఈ, బిఎస్ఈ, కొన్ని పోస్టాఫీసుల  ద్వారా మాత్రమే వీటిని కొనడం సాధ్యం, 

 

గడువు ముగిసిన తర్వాత స్పాట్ మార్కెట్ రేటు ప్రకారం రేటు చెల్లించడం అలానే ఈ లోపున సంవత్సరానికి 2.5శాతం వడ్డీ  ఇవ్వడం బోనస్. ముందు చెప్పుకున్నట్లుగా 9 అంచెలకు మంచి రెస్పాన్సే రాగా, ఇప్పుడు పదో దశలో సావరిన్ గోల్డ్ బాండ్లకు అక్టోబర్ 25 నుంచి ధరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఆ రోజునుంచే కొనుగోళ్లు ప్రారంభం అవుతాయ్. 

 

ఈ బాండ్లకు కాల పరిమితి ఎనిమిదేళ్లు..ఐతే ఐదో ఏట నుంచే అంటే ఇప్పటి పదోదశ బాండ్ల కొనుగోలునే తీసుకుంటే, 2026 అక్టోబర్ 26 నుంచి అమ్ముకోవచ్చు. వడ్డీని ఏడాదికి, ఆరునెలలకు చెల్లిస్తారు

 

ఆభరణాలు, కడ్డీలు, నగల రూపంలోని డిమాండ్‌ని తగ్గించడం కోసం, మరో పెట్టుబడి సాధనంగా కూడా సావరిన్ గోల్డ్ బాండ్లు పాపులర్ అయ్యాయ్.ఈ స్కీమ్ 2015 నవంబర్‌లో లాంఛ్ అయింది. అయితే అప్పట్లో రెండు మూడు అంచెల బాండ్ల అమ్మకాలకు పెద్దగా రెస్పాన్స్ రాలేదు. ఆ తర్వాతే
ఈ వడ్డీ బోనస్‌పై అవగాహన పెరగడంతో జనం స్కీమ్‌ని సక్సెస్ చేసారు


GOLD SOVEREIGN BOND SCHEME

Expert's View


మంచి కంపెనీల IPO లకు ఎందుకు ఆదరణ కరువైంది ?

Trending