భారీ పతనం దిశగా సూచీలు..! 300 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ, సెన్సెక్స్‌కి 800 పాయింట్ల నష్టం, దంచి కొడుతోన్న ఫార్మా

2021-11-26 09:58:01 By Anveshi

img

స్టాక్ మార్కెట్లు ముందుగా అంచనా వేసిన దానికంటే కూడా వేగంగా పతనం అయింది. ఇవాళ డిసెంబరా్ సిరీస్ మొదటి రోజే, నిఫ్టీ దాదాపు 250 పాయింట్లు కోల్పోయింది. సెన్సెక్స్ కూడా దాదాపు 800 పాయింట్లు కోల్పోయింది . ఆ తర్వాత పతనం మరింత ఎక్కువై నిఫ్టీ 300 పాయింట్లు నష్టపోయి 17240 పాయింట్లకు చేరింది

 

బ్యాంక్ నిప్టీ, ఐటీ,కన్జ్యూమర్ డ్యూరబుల్, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లలో అమ్మకాలు పోటెత్తగా
ఒక్క ఫార్మా సెక్టార్ మాత్రం దూసుకుపోయింది. ఇలా గతంలో కరోనా కేసులు పెరిగినప్పుడు మాత్రమే
జరిగింది. అంటే ఇండెక్స్‌లు బైటికి కన్పించని ఇలాంటి కారణాలకు స్పందిస్తుందని అర్ధమవుతోంది

 

టాప్ గెయినర్లలో సిప్లా, డా.రెడ్డీస్, సన్‌ఫార్మా, దివీస్ ల్యాబ్స్స్, అదానీ పోర్ట్స్ 4 నుంచి 2శాతం వరకూ
లాభపడ్డాయ్. మొత్తం గెయినర్ల లిస్టులో ఫార్మా స్టాక్స్ ర్యాలీ చేయడం గమనించాలి. ట్రేడర్లు ఈ స్టాక్స్‌ని
ఇవాళ ఇంకా ఇంకా పెంచే ఛాన్స్ కన్పిస్తోంది

లూజర్లలో టాటా మోటర్స్, బజాజ్ ఫైనాన్స్, ఓఎన్‌జిసి, బజాజ్ ఫిన్ సర్వ్, మారుతి సుజికి, కోటక్ మహీంద్రా 4 నుంచి 2శాతం వరకూ నష్టపోయాయ్


CIPLA VIRUS NIFTY DOWN

Expert's View


మంచి కంపెనీల IPO లకు ఎందుకు ఆదరణ కరువైంది ?

Trending