తెలంగాణలో Flip Cart వినూత్న ప్రయోగం

2021-06-11 22:02:08 By Y Kalyani

img

తెలంగాణలో Flip Cart వినూత్న ప్రయోగం

ఇండియాలో టెక్ దిగ్గజాలకు కేరాఫ్ అయిన హైదరాబాదు ఉన్న తెలంగాణ ప్రభుత్వం సరికొత్త ప్రయోగాలకు సిద్దమైంది. ఆరోగ్య రంగంలో అత్యాధునిక వ్యవస్థను ఎవరూ చేరుకోలేని మారుమూల గ్రామాలకు అందించే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా పలు అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు చేసుకుంది.  
Medicines from the Sky వినడానికి కొత్తగా ఉన్నా మారుమూల ప్రాంతాల అవసరాలు తీర్చడానికి మంచి డెసిషన్ అంటోంది తెలంగాణ ప్రభుత్వం. అవును త్వరలో ఆకాశం మీదుగా తెలంగాణలోని మారుమూల ప్రాంతాలకు డ్రోన్ల సాయంతో మెడిసిన్స్ అందించడానికి రంగం సిద్దమవుతోంది. ఇందుకోసం ఫ్లిప్ కార్ట్ కంపెనీ తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. జియో మ్యాపింగ్ ద్వారా గిరిజన ప్రాంతాల్లో మెడిసిన్ అందని జనాలకు ఇక మీదట టెక్నాలజీ సాయంలో అందించాలని నిర్ణయించారు. సరైన రహదారి సౌకర్యాలు లేని ప్రాంతాలకు అత్యంత వేగంగా మెడిసన్స్ అందించడానికి ఇదో ప్రయోగాత్మకంగా చేపడుతున్నారు. రానున్న వారంలో దీనిని పైలెట్ ప్రాజెక్టుగా చేపడుతున్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకుని వేలాది వ్యాక్సిన్లు సరఫరా చేయాలని నిర్ణయించారు. 
ప్రస్తుతం ఇది కరోనా ట్రీట్మెంట్ విషయంలో వినియోగంలోకి తీసుకొస్తున్నా.. త్వరలో విపత్తుల సమయంలో కూడా కొనసాగుతుందని చెబుతున్నారు. ఈ విషయంలో టెక్ కంపెనీలు పోటీ పడుతున్నారు. గూగుల్ కూడా తెలంగాణ ప్రభుత్వంలో డ్రోన్ పంపిణీ విషయంలో ఒప్పందం చేసుకుంది. ప్రతి ఒక్కరికీ వైద్యం నినాదంలో భాగంగా డ్రోన్ వ్యవస్థను ఆరోగ్య రంగంలో భాగంగా చేయనున్నారు. 


health market flipcart drone ts

Expert's View


నేను వేసుకున్న కోటు రంగు , రానున్న రోజుల్లో మార్కెట్ల రంగు ఇదేనా ?

Trending