మినిమమ్ ప్రాఫిట్ పంచే 3 హాట్ స్టాక్స్

2021-03-04 08:13:33 By Anveshi

img

టెక్నికల్‌గా నిఫ్టీ బుల్లిష్ హారామీ క్యాండిల్ స్టిక్ ప్యాటెర్న్ నమోదు చేసిన తర్వాత రెండు రోజుల బలమైన ర్యాలీ నడిచింది. ఐతే 15100 పాయింట్ల లెవల్ వద్ద కాస్త స్మాలర్ డిగ్రీ కన్సాలిడేషన్ రేంజ్ బ్రేకవుట్ కూడా రికార్డ్ చేసింది. డైలీ చార్టులపై 21 రోజుల ఎక్స్‌పొనెన్షియల్ మూవింగ్ యావరేజ్‌పైనే క్లోజ్ అవడం గమనించవచ్చు. రాబోయే రోజుల్లో నిఫ్టీ 15600 పాయింట్లను తాకే సూచనలు కన్పిస్తున్నాయ్. ఈ మేరకు రోహన్ పాటిల్ మూడు స్టాక్స్‌ని ట్రేడింగ్ కోసం రికమండ్ చేశారు

కొనండి I సిటీ యూనియన్ బ్యాంక్ I ఎల్ టిపి రూ.181.25 I టార్గెట్ రూ.194 I స్టాప్‌లాస్ రూ.173 I అప్‌సైడ్ 7%

డైలీ టైమ్ ఫ్రేమ్‌లో సిటీ యూనియన్ బ్యాంక్ స్టాక్ ధరలు ఫాలింగ్ ఛానల్ ప్యాటెర్న్‌ నమోదు చేసాయి.  ప్రస్తుతం ట్రెండ్ లైన్ సపోర్ట్ ఎగువనే స్టాక్ ట్రేడవుతోంది.158లెవల్స్ దగ్గర 50 పర్సెంట్ రిట్రేస్‌మెంట్ సపోర్ట్ దొరుకుతుండగా, వీక్లీ ఇంటర్వెల్స్ దగ్గర ఈ స్టాక్‌కి ఉన్న మధ్యంతర అల్పధరని కూడా అధిగమించింది.50,100 ఎక్స్‌పొనెన్షియల్ మూవింగ్ యావరేజ్‌పైనే స్టాక్ ట్రేడవుతోంది. దీంతో పాటు ఆర్ఎస్ఐ 14 ఇండికేటర్ కూడా 60 లెవల్ దగ్గర క్రాసోవర్ అవడం స్టాక్ తొందర్లోనే మరింత దూసుకుపోతుందనడానికి సంకేతం
 

కొనండి Iఎంసిఎక్స్ I ఎల్‌టిపి రూ.1541 I టార్గెట్ రూ.1680 I స్టాప్‌లాస్ రూ.1464 I అప్‌సైడ్ 9% I

వీక్లీ చార్టులపై ఏబి-సిడి హార్మోనిక్ ప్యాటెర్న్ నమోదు చేసిన ఈ కౌంటర్‌లో పొటెన్షియల్ రివర్సల్ జోన్ పైనే ధరలు ట్రేడవుతున్నాయ్.వీక్లీ, మంత్లీ టైమ్ ఫ్రేములపై 50,100 రోజుల ఎక్స్‌పొనెన్షియల్ యావరేజ్‌లపైనే ట్రేడవుతోంది. దీంతో కనీసం 9శాతం మొమెంటమ్ కన్పిస్తుందని రోహన్ పాటిల్ రికమండ్ చేస్తున్నారు. స్టాప్‌లాస్ రూ.1464ని ఖచ్చితంగా మెయిన్‌టైన్ చేయాలని హెచ్చరించారు
 

కొనండి I అమరరాజా బ్యాటరీస్ I ఎల్‌టిపి రూ.915 I టార్గెట్ రూ. 965I స్టాప్‌లాస్ రూ.885 I అప్‌సైడ్ 5% 

డైలీ టైమ్ ఫ్రేమ్ చార్టులలో స్మాలర్ డిగ్రీ రెక్టేంగిల్ ప్యాటెర్న్ బ్రేకవుట్ నమోదు అయింది. ట్రెండ్ లైన్ సపోర్ట్ పైనే స్టాక్ ట్రేడవుతోంది.డైలీ ఇంటర్వెల్స్‌పైన కూడా బుల్లిష్ ఏబి-సిడి హార్మోనిక్ ప్యాటెర్న్ నమోదు చేస్తూ రూ.860దగ్గర 50% రిట్రేస్‌మెంట్ సపోర్ట్ తీసుకుంది.దీంతో తొందర్లోనే అమరరాజా బ్యాటరీస్ షేరు మరో 50 రూపాయల వరకూ పెరుగుతోందని టెక్నికల్ అనలిస్ట్ రోహన్ పాటిల్ అంచనా వేసారు

( పై స్టాక్ రికమండేషన్స్‌కి profityourtrade సైట్ కి సంబంధం లేదు)
 

Expert's View


WHAT IS BITCOIN ? HOW TO INVEST IN CRYPTO CURRENCY ?

Trending